ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే..!

కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన కేసీఆర్.. ఏమన్నారంటే..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత నెలలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తొలిసారి కుమార్తె అరెస్ట్‌పై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. కవిత అరెస్ట్‌ ముమ్మాటికీ అక్రమమేనని, అసలు లిక్కర్ స్కాం అంతా ఉత్తిదేనని అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించినాం కదా. అప్పటి నుండి ప్రధాని మోదీ నాపై కక్ష కట్టిండు. అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపిండు. బీఎల్ సంతోష్‌పై మనం కేసు పెట్టకపోతే కవిత అరెస్టు ఉండకపోయేది’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకు కవిత తప్పు చేసినట్టు 100 రూపాయల ఆధారం కూడా చూపెట్టలేకపోయారని, ముమ్మాటికీ తన కుమార్తెను కుట్రపూరితంగానే లిక్కర్ కేసులో ఇరికించారని కేసీఆర్ ఆరోపించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :