ASBL NSL Infratech

కార్తికేయ‌3 వ‌చ్చేద‌ప్పుడేనా?

కార్తికేయ‌3 వ‌చ్చేద‌ప్పుడేనా?

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నిఖిల్ త‌న‌కంటూ స్పెష‌ల్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. విభిన్న క‌థ‌ల‌తో ప్రేక్ష‌కులను ఎంట‌ర్టైన్ చేస్తూ వ‌స్తున్న నిఖిల్ కెరీర్లో కార్తికేయ సినిమాకు ప్ర‌త్యేక స్థానం ఉంది. 2014లో వ‌చ్చిన కార్తికేయ సినిమా మంచి హిట్ అవ‌డంతో ఆ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ‌2 2022లో తీసి మ‌రోసారి మంచి బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకున్నారు. కార్తికేయ‌2తో పాన్ ఇండియా స్థాయిలో త‌న స్టామినాను నిరూపించుకున్నాడు నిఖిల్. ఆ సినిమా ఎండింగ్ లోనే కార్తికేయ‌3 కూడా ఉంటుంద‌ని హింట్ఇచ్చి దానికి సంబంధించిన కొన్ని ర‌షెస్ కూడా చూపించారు. దీంతో కార్తికేయ‌3 మ‌రింత భారీగా ఉండ‌బోతుంద‌ని అంద‌రికీ అర్థ‌మైంది.

కార్తికేయ‌2 పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు రావ‌డం వ‌ల్ల కార్తికేయ‌3కు బ‌డ్జెట్ విష‌యంలో కూడా ప‌రిమితులు లేవు. ఈ సినిమా క‌థ లాక్ అయిన‌ప్ప‌టికీ నిఖిల్ ఈ సినిమాను మొద‌లుపెట్టాలంటే ముందు త‌న చేతిలో ఉన్న స్వ‌యంభు, ది ఇండియా హౌస్ సినిమాలు పూర్తి చేయాలి. ఈ సినిమాలు పూర్తి చేశాకే నిఖిల్ కార్తికేయ‌3ను సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్సులున్నాయి.

మ‌రోవైపు చందూ మొండేటి కూడా ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌తో తండేల్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్త‌య్యాకే కార్తికేయ‌3 పైన దృష్టి పెట్ట‌గ‌ల‌డు. కాబ‌ట్టి కార్తికేయ‌3 వ‌చ్చే సంవ‌త్స‌రం మొద‌లైనా పూర్త‌వ‌డానికి ఎంత‌లేద‌న్నా 2026 ఎండింగ్ అవుతుంది. ఈ సినిమాపై ఉన్న హైప్ ను, క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని సినిమాను మ‌రింత గ్రాండ్ గా తెర‌కెక్కించాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :