కార్తికేయ ఆశలన్నీ ఆ సినిమా పైనే!
ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించాడు హీరో కార్తికేయ. ఆ తర్వాత కార్తికేయ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లే. విలన్ గా ట్రై చేసిన వాటిలో నాని గ్యాంగ్ లీడర్ నిరాశ పరచగా, అజిత్ వలిమై కమర్షియల్ గా సక్సెస్ అందుకుంది. కానీ ఆ సినిమా తర్వాత కూడా కార్తికేయకు కోలీవుడ్ నుంచి పెద్దగా ఆఫర్లు రాలేదు.
గతేడాది వచ్చిన బెదురులంక 2012 కాస్త బెటర్ రిజల్ట్ ను ఇచ్చింది. సినిమా మరీ సూపర్ గా లేకపోయినా కలెక్షన్ల పరంగా సేఫ్ అయింది. అయితే ఇప్పుడు కార్తికేయ ఆశలన్నీ తను చేస్తున్న భజే వాయు వేగం మీదే ఉన్నాయి. యువి కాన్సెప్ట్స్ సంస్థ నిర్మాణంలో ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది.
టీజర్ చూస్తుంటే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. చిన్నప్పుడు తండ్రికిచ్చిన మాట కోసం పెద్దయ్యాక ఆ యువకుడు డ్రగ్స్ మాఫియాను ఎదుర్కొన ప్రాణాలకు తెగించి చేసే సాహసం చుట్టూ సినిమా నడిచేట్లుంది. కార్తికేయ ఇలాంటి జానర్ ట్రై చేయడం ఇదే మొదటిసారి. మే నెలలో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు. ఈ మధ్య యువి తీస్తున్న మీడియం బడ్జెట్ సినిమాలన్నీ బాగానే వర్కవుట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భజే వాయు వేగం కూడా హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ సినిమా అయినా కార్తికేయకు మంచి ఫలితాన్నిస్తుందేమో చూడాలి.