ASBL NSL Infratech

గేమ్ ఛేంజ‌ర్ లో క‌మ‌ల్‌?

గేమ్ ఛేంజ‌ర్ లో క‌మ‌ల్‌?

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేసిన ఆచార్య సినిమా ఫ్యాన్స్ ను బాగా డిజ‌ప్పాయింట్ చేసింది. ఆచార్య త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ సోలో హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజ‌ర్. దిల్ రాజు ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను శంక‌ర్ నెక్ట్స్ లెవెల్ లో తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గేమ్ ఛేంజ‌ర్ సినిమాలో శంక‌ర్ ఎన్నో స‌ర్‌ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

గేమ్ ఛేంజ‌ర్ సినిమాలో లోక‌నాయ‌కుడు కమ‌ల్ హాస‌న్ తో శంక‌ర్ ఓ స‌ర్‌ప్రైజ్ క్యామియో చేయిస్తున్న‌ట్లు నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతుంది. ఒకేసారి క‌మ‌ల్ తో ఇండియ‌న్2, చ‌ర‌ణ్ తో గేమ్ ఛేంజ‌ర్ చేసిన శంక‌ర్, గేమ్ ఛేంజ‌ర్ కోసం క‌మ‌ల్ ను రిక్వెస్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. నేష‌న‌ల్ వైడ్ గా గేమ్ ఛేంజ‌ర్ పై ఉన్న హైప్ ను పెంచేందుకు శంక‌ర్ ఇలా ప్లాన్ చేసిన‌ట్లు టాక్.

నిజంగా క‌మ‌ల్ ఈ గెస్ట్ రోల్ చేస్తే మాత్రం గేమ్ ఛేంజ‌ర్ కు అది చాలా పెద్ద ప్ల‌స్ అవుతుంద‌ని చెప్పొచ్చు. ఇప్ప‌టికే క‌ల్కిలో ఓ కీల‌క పాత్ర చేస్తున్న క‌మ‌ల్, ఈ సినిమాలో కూడా న‌టిస్తే ఆడియ‌న్స్ కు పండ‌గే. ఇదిలా ఉంటే క‌మ‌ల్ గేమ్ ఛేంజ‌ర్ లో క‌నిపిస్తాడ‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. మ‌రి గేమ్ ఛేంజ‌ర్ లో క‌మ‌ల్ నిజంగా ఉన్నాడా లేదా ఇవ‌న్నీ పుకార్లేనా అన్న‌ది టీమ్ అఫీషియ‌ల్ గా చెప్తే త‌ప్ప క్లారిటీ రాదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :