ASBL NSL Infratech

మ‌రోసారి జెర్సీ కాంబో?

మ‌రోసారి జెర్సీ కాంబో?

వ‌రుస హిట్ల‌తో ఫుల్ జోష్ లో ఉన్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. ప్ర‌స్తుతం నాని వివేక ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో స‌రిపోదా శ‌నివారం సినిమా చేస్తున్నాడు. డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని శ‌నివారం మాత్ర‌మే ఫైటే చేసే హీరోగా ఆడియ‌న్స్ ను స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నాడు. ఆ త‌ర్వాత సుజిత్ తో మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు నాని. ఓజీ సినిమా పూర్తైన వెంట‌నే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది.

ఇది కాకుండా నానికి ద‌స‌రా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ అందించిన శ్రీకాంత్ ఓదెల‌తో మ‌రో సినిమా చేయ‌డానికి నాని ప‌చ్చ‌జెండా ఊపాడు. అంటే స‌రిపోదా శ‌నివారం కాకుండా నాని చేతిలో మ‌రో రెండు సినిమాలున్నాయి. ఈ రెండూ కాకుండా మ‌రో సినిమాకు కూడా నాని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. నానికి జెర్సీ లాంటి మెమ‌ర‌బుల్ ఫిల్మ్ ను ఇచ్చిన గౌత‌మ్ తిన్న‌నూరితో సినిమా చేసేందుకు నాని ఓకే అన్నాడని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా చేస్తున్న గౌత‌మ్, ఆ సినిమా అయిపోగానే మ‌రోసారి నానితో సినిమ చేయాల‌ని చూస్తున్నాడ‌ట. విజ‌య్ తో స్పై థ్రిల్ల‌ర్ చేస్తున్న గౌత‌మ్, నాని కోసం మ‌రో అద్భుత‌మైన క‌థ‌ను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. సో మ‌రోసారి జెర్సీ కాంబో రానుంద‌న్న‌మాట‌.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :