ASBL NSL Infratech

పుష్ప‌2 ట్రైల‌ర్‌కు భారీ ప్లాన్లు

పుష్ప‌2 ట్రైల‌ర్‌కు భారీ ప్లాన్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న పుష్ప‌2 ఆగ‌స్ట్ 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అంద‌రి కంటే ఎక్కువగా నార్త్ ఆడియ‌న్స్ ఎదురుచూస్తున్నారు. పుష్ప‌1 ఆ రేంజ్ లో హిట్ అయిందంటే అది బాలీవుడ్ ఆడియ‌న్స్ వ‌ల్లే అన్న విష‌యం తెలిసిందే. అందుకే పుష్ప‌2 ని సుకుమార్ నార్త్ ఆడియ‌న్స్ ను దృష్టిలో ఉంచుకుని చాలా జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేస్తున్నాడు.

పుష్ప2 విష‌యంలో పోస్ట‌ర్స్ ద్వారానే హైప్ క్రియేట్ చేస్తున్నాడు సుకుమార్. రీసెంట్ గా రిలీజైన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను డబుల్ చేసింది. అయితే ఈ సినిమా ట్రైల‌ర్ విష‌యంలో సుకుమార్ చాలా భారీగా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. పుష్ప‌2 ట్రైల‌ర్ ను దేశం మొత్తం చూసేలా అన్ని మ‌ల్టీప్లెక్స్ ల్లో ట్రైల‌ర్ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నార‌ట‌.

దేశంలో ఉన్న అన్ని మ‌ల్టీప్లెక్స్‌ల్లో ఒకేసారి పుష్ప‌2 ట్రైల‌ర్ చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారట పుష్ప2 మేక‌ర్స్. ఇక్క‌డే కాదు ఓవ‌ర్సీస్ లో కూడా ట్రైల‌ర్ రిలీజ్ కు భారీ ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా విష‌యంలో ప్ర‌తి విష‌యంలో అంచ‌నాల‌ను దాటేలా సుక్కు ప్లానింగ్స్ ఉంటున్నాయి. సినిమా అనుకున్న విధంగా అంచ‌నాల‌ను అందుకుంటే పుష్ప2 బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించ‌డం ఖాయం.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :