ASBL NSL Infratech

నేను రుణమాఫీ చేసిన వెంటనే.. కేసీఆర్ బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా? : సీఎం రేవంత్

నేను రుణమాఫీ చేసిన వెంటనే.. కేసీఆర్ బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా? : సీఎం రేవంత్

ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదింటిని 100 రోజుల్లోనే అమలు చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా  మద్దూరులో పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్నా కేసీఆర్‌ మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఎద్దేవా  చేశారు. ఆయన చేసిన రైతు రుణమాఫీ బ్యాంకుల వడ్డీకే సరిపోలేదని విమర్శించారు. కొడంగల్‌ బిడ్డకు కాంగ్రెస్‌ సీఎం, పీసీసీ పదవిని ఇచ్చిందన్నారు. కేసీఆర్‌ చేసిన అప్పులకు మేం రూ.24 వేలు కోట్ల వడ్డీ కట్టాం. రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని నేను హామీ ఇచ్చా. ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేస్తా. నేను రుణమాఫీ చేసిన వెంటనే కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ను రద్దు చేస్తారా?  ఏ రైతు అధైర్య పడాల్సిన అవసరం లేదు. రైతులను బ్యాంకులు ఇబ్బంది పెట్టొద్దు. రుణమాఫీ చేసే బాధ్యత నాది. కాంగ్రెస్‌  కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలి. బీజేపీ నేతలు దేవుడిని రోడ్లపైకి తెస్తున్నారు. దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. మోదీ ఏ హామీని నెరవేర్చలేదు అని విమర్శించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :