ASBL NSL Infratech

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై పై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్

తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై పై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్

తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ ఎంపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఈసీకి బీఆర్‌ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. సికింద్రాబాద్ ఎమ్మెల్యే కాలనీలో అయోధ్య రామమందిర ప్రతిరూపాలను ఆమె పంపిణీ చేశారని, ఈ మేరకు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయని, తమిళిసై చర్య ఐపీసీ సెక్షన్ 188, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ (ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం) ఉల్లంఘనే అని బీఆర్ఎస్ తమ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా బీఆర్ఎస్ కంప్లైంట్ దాఖలు చేసింది. కాగా.. బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. తమిళనాడులో ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో చెన్నై సౌత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తమిళిసై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలో తమిళం మాట్లాడే ప్రజలతో మమేకమయ్యేందుకు ఇక్కడ గవర్నర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న తమిళిసైని రాష్ట్ర బీజేపీ నియమించింది. ఈ మేరకు ఈ మధ్యనే బీజేపీ ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్ రెడ్డి ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలోనే జంట నగరాల్లో తమిళిసై బీజేపీ తరపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :