ASBL NSL Infratech

నేను పుట్టింది కాంగ్రెస్ కోసమే ..బండ్ల గణేష్..

నేను పుట్టింది కాంగ్రెస్ కోసమే ..బండ్ల గణేష్..

తాను కాంగ్రెస్ పార్టీ కోసం పుట్టానని... కాంగ్రెస్ పార్టీలోనే చస్తానని ..ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేశ్ అన్నారు. మంథనిలో గురువారం నాడు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గణేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సారి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 స్థానాలు పక్కాగా గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. దేశానికి ఎంతో సేవ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న గణేష్..దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేయడం ఓటెయ్యమని అడగడం తనకు ఎంతో గర్వకారణం అని పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :