ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

‘సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలి’: ఆటా మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రముఖుల పిలుపు

‘సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలి’: ఆటా మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రముఖుల పిలుపు

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వర్చువల్‌గా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో యూఎస్ఏ, భారత్‌కు చెందిన 9 మంది ప్రముఖులు పాల్గొని ఈ ఏడాది మహిళా దినోత్సవం థీమ్ గురించి తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. వీరిలో లతమ ఫౌండేషన్ చైర్‌పర్సన్, లోపముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ లత కొంపెల్ల, ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, స్టోరీ టెల్లర్ రమా రవి, ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, వీసీ ఇన్వెస్టర్ డాక్టర్ నీతా సచన్, యాక్సెంచర్‌లో డాటా అండ్ ఏఐ విభాగం గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్ రేవతి సుబ్రమనియన్, పాటూరి లాకు చెందిన బోయపాటి పాటూరి తదితరులు ఉన్నారు. వీరంతా కూడా అన్ని రంగాల్లో మహిళల పాత్రను పెంచాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే మహిళలంతా తమకు ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలని పిలపునిచ్చారు. ఆటా మహిళా కమిటీ చైర్ ప్రవీణా అంబటి, కోచైర్ అనుపమ సుబ్బగారి, మహిళల కన్వెన్షన్ కమిటీ చైర్ మల్లికా రెడ్డి దుంపల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు శారద సింగిరెడ్డి ఈ కార్యక్రమానికి మోడరేటర్లుగా వ్యవహరించారు. ఆటా ఫేస్‌బుక్ లైవ్, యూట్యూబ్ లైవ్‌లో ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :