ASBL NSL Infratech

భారత్ పై యాపిల్ ఫోకస్.. మూడేళ్లలో 5 లక్షల మందికి

భారత్ పై యాపిల్ ఫోకస్.. మూడేళ్లలో 5 లక్షల మందికి

భారత్‌లో యాపిల్‌ ఫోన్ల ఉత్పత్తిని భారీగా పెంచాలని భావిస్తున్న యాపిల్‌ ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం భారత్‌లో రెండు టాటా ఎలక్ట్రానిక్స్‌లో పనిచేస్తున్న వారితో కలిపి యాపిల్‌కు 1.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో యాపిల్‌ భారత్‌లో 5 లక్షల మంది ఉద్యోగులను తీసుకోనుంది. యాపిల్‌ కంపెనీ భారత్‌పై  ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ముంబైలో యాపిల్‌ సాకేత్‌ పేరుతో, ఢిల్లీలో యాపిల్‌ బీకేసీ పేరుతో రెండు ఎక్స్‌క్లూజివ్‌ యాపిల్‌ స్టోర్లను ప్రారంభించింది. ఇలాంటి స్టోర్లను క్రమంగా దేశమంతా విస్తరించాలని యాపిల్‌ భావిస్తోంది. భారత్‌లో యాపిల్‌ ఐఫోన్లు తయారు చేస్తున్న వెండర్స్‌, కంపోనెంట్‌ సప్లయర్స్‌ ద్వారా యాపిల్‌ రానున్న మూడేళ్లలో 5 లక్షల మంది ఉద్యోగులను తీసుకోనుందని సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడిరచారు. భారత్‌లో యాపిల్‌ తన ఉత్పత్తులను భారీగా పెంచనుందని ఆయన తెలిపారు. ఇందు కోసం యాపిల్‌ భారత్‌లో రానున్న 4`5 సంవత్సరాల్లో 3.32 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :