ASBL NSL Infratech

చంద్రగిరి అభ్యర్థి నానికి భద్రత కల్పించండి: హైకోర్టు ఆదేశం

చంద్రగిరి అభ్యర్థి నానికి భద్రత కల్పించండి: హైకోర్టు ఆదేశం

చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానికి 1G1 సెక్యూరిటీ  ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కుటుంబసభ్యులకు కూడా భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తనకు భద్రత కల్పించాలని ఎస్పీని కోరినా, స్పందించకపోవడంతో పులివర్తి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున న్యాయవాది ఉమేశ్‌ చంద్ర వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు ఆదేశాలతో 2G2 భద్రత ఇచ్చి ఆ తర్వాత తొలగించారని తెలిపారు. భద్రత కల్పించాలని కోరినా పోలీసు శాఖ ఉత్తర్వులు ఇవ్వలేదని వివరించారు. దీంతో పోటీ చేసిన అభ్యర్థికి భద్రత ఇవ్వాలని కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. నేటి నుంచే పులివర్తి నానికి, ఆయన కుటుంబ సభ్యులకు 1G1 భద్రత కల్పించాలని స్పష్టం చేసింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :