ASBL NSL Infratech

ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న అనుప‌మ‌

ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న అనుప‌మ‌

ప‌క్కింటి అమ్మాయిలా ఉండే అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను టిల్లు స్వ్కేర్ సినిమాలో చూసి షాకవని వాళ్లు లేరు. త‌న ప‌దేళ్ల కెరీర్లో ఎప్పుడూ అనుప‌మ ఇంత హాట్ గా క‌నిపించింది లేదు. టిల్లు స్వ్కేర్ లో అనుప‌మ లెక్క‌లేన‌న్ని లిప్ లాక్స్ పెట్ట‌డం, క్లీవేజ్ షో లు చేయ‌డం, ఇంటిమేట్ సీన్స్ లో న‌టించ‌డం ఫ్యాన్స్ ను షాక‌య్యేలా చేసింది. ఈ విష‌యంలో కొంత‌మంది ఫ్యాన్స్ హ‌ర్ట‌య్యారు కూడా.

కానీ ఎప్పుడూ ఒకే త‌ర‌హా క్యారెక్ట‌ర్ చేయ‌డం ఇష్టం లేని అనుప‌మ‌, టిల్లు స్వేర్ సినిమ‌తో త‌న ఇమేజ్ ను పూర్తిగా మార్చుకుంది. టిల్లు స్వ్కేర్ పెద్ద హిట్ట‌వ‌డంతో అనుప‌మ కెరీర్ కు మంచి ఊపొస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. సినిమా రిలీజై ఇన్ని రోజులవుతున్నా, అనుప‌మ ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సినిమా కూడా ఓకే చేసిన‌ట్లు క‌నిపించ‌డం లేదు.

టిల్లు స్వ్కేర్ త‌ర్వాత అనుప‌మ‌కు అన్నీ బోల్డ్ క్యారెక్ట‌ర్లే వ‌స్తున్నాయ‌ట‌. ఈ సినిమాలో లానే అందాల ఆర‌బోస్తూ ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్స్ చేస్తే రెమ్యూన‌రేష‌న్ ఎంతైనా స‌రే ఇవ్వ‌డానికి నిర్మాత‌లు రెడీగా ఉన్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో అనుప‌మ ఈ ఆఫ‌ర్ల‌ను ఒప్పుకోవాలా వ‌ద్దా అనే క‌న్ఫ్యూజ‌న్ లో ఉంద‌ట‌. టిల్లు స్వ్కేర్ లో క్యారెక్ట‌ర్ డిమాండ్ చేసింది కాబట్టి ఆ పాత్ర‌కు ఒప్పుకుంది కానీ ప్ర‌తిసారీ అలానే క‌నిపించాల‌ని అనుప‌మ అనుకోవ‌డం లేద‌ట‌. అందుకే త‌ర్వాతి సినిమాల విష‌యంలో అనుప‌మ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :