ASBL NSL Infratech

లోకల్ మేనిఫెస్టోతో అమర్నాథ్.. వెరైటీ ప్రచారం..

లోకల్ మేనిఫెస్టోతో అమర్నాథ్.. వెరైటీ ప్రచారం..

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు తమ వంతు సరికొత్త ప్రచారాలకు తెర లేపుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడ స్థానిక నియోజకవర్గాలకు సంబంధించి లోకల్ మేనిఫెస్టోలు అనే ప్రయోగాలతో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ పార్టీ ఇప్పటికే తన మేనిఫెస్టోని విడుదల చేసిన నేపథ్యంలో.. మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ప్రత్యేకంగా ఓ లోకల్ మేనిఫెస్టోని సృష్టించారు. గతంలో అనకాపల్లి నుంచి గెలిచిన అమర్నాథ్ ఇప్పుడు గాజువాక నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన లోకల్ మేనిఫెస్టోని ఆయన సిద్ధం చేయించారు. అంతేకాదు ప్రజల చేత, ప్రజల కోసం ఈ లోకల్ మేనిఫెస్టో రూపకల్పన చేశామంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేనిఫెస్టోని ఒక హామీ పత్రం లాగా రెడీ చేసి.. విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్లానింగ్ వేస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ తో పాటు మరికొందరు వైసిపి నేతలు స్థానికంగా తాము చేపట్టబోయే కొత్త కార్యక్రమాలకు సంబంధించి ఇలాంటి లిస్టులను రెడీ చేసి పాంప్లెట్ల రూపంలో ప్రచారం చేస్తున్నారు.



 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :