ASBL NSL Infratech

జనసేనాని కోసం రంగంలోకి దిగిన పుష్పరాజ్..

జనసేనాని కోసం రంగంలోకి దిగిన పుష్పరాజ్..

ఈసారి పవన్ కళ్యాణ్ ఎలాగైనా గెలిచి పిఠాపురంలో తన సత్తా నిరూపించుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలతో పాటు మెగా కుటుంబం కూడా పవన్ కు మద్దతుగా దిగుతోంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ కోసం మెగా హీరోలు ఒక్కొక్కరు రంగంలోకి దిగుతున్నారు. మొన్న వరుణ్ తేజ్, నిన్న సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. మెగాస్టార్ తమ్ముడికి మద్దతుగా సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసారు. రామ్ చరణ్ బాబాయి కోసం తన వంతు మద్దతును తెలియపరిచారు. ఈ నేపథ్యం లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా జ‌న‌సేనానికి త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఎక్స్ (ట్విట‌ర్‌) వేదిక‌గా అల్లు అర్జున్.. ’మీ ఎన్నిక‌ల ప్ర‌యాణానికి నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. ప్రజల సేవ కోసం మీరు మీ జీవితాన్ని అంకితం చేయడం మాకెంతో గర్వకారణం. మీరు కోరుకున్నది మీరు జీవితంలో సాధించాలని ఆకాంక్షిస్తూన్నాను’ అని ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ పెట్టిన ఈ ట్వీట్ ను అభిమానులు బాగా వైరల్ చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :