ASBL NSL Infratech

రుద్రవరం పోస్టర్‌ ఆవిష్కరణ

రుద్రవరం పోస్టర్‌ ఆవిష్కరణ

ఇంతకుముందు ప్రయత్నం, నీ రూపమే నా శ్వాసగా వంటి లఘు చిత్రాలతో తన ప్రతిభను నిరూపించుకున్న విజయ్‌కాంత్‌ (వికే) తాజాగా రూపొందించిన ఇండిపెండెంట్‌ ఫిలిం రుద్రవరం. ప్రేమలు కూడా కలుషితం అవుతున్న నేటి తరుణంలో స్వచ్ఛమైన ప్రేమికులకు ఎదురైన కష్టాల నేపథ్యంలో అందమైన లొకేషన్లలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత సూర్య పత్రికాధినేత నూకారపు సూర్యప్రకాశరావు ఆవిష్కరించి.. దర్శకుడు విజయ్‌కాంత్‌ను అభినందించారు. పోతగాని ప్రొడక్షన్స్‌ పతాకంపై యోషిత్‌- వందిత సమర్పణలో దీపిక్‌ దగాని, స్వాతి భీమిరెడ్డి జంటగా విజయ్‌కాంత్‌ దర్శకత్వంలో వై.వి.హరినాత్‌, శ్రీకాంత్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో దీపక్‌ దగాని, హరిప్రసాద్‌ కొన్నోజు, వీరభద్రమ్‌, మహంతి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విజయ్‌కాంత్‌, సూర్య డైరెక్టర్‌ కూనిరెడ్డి శ్రీనివాస్‌, ఎడిటర్‌ కె.వి.యస్‌.సుబ్రహ్మణ్యం, శ్రీనివాస కుమార్‌, మాణిక్‌ ప్రభు, నాగభూషణం, ధీరజ అప్పాజీ, హరిప్రసాద్‌, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దీపురెడ్డి, సంగీతం: నరసింహా తోటపల్లి, ఎడిటింగ్‌: శశికాంత్‌రెడ్డి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :