ASBL NSL Infratech

సామాజిక సేవా కోసం కనెక్ట్‌ టు ఆంధ్ర

సామాజిక సేవా కోసం కనెక్ట్‌ టు ఆంధ్ర

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ-సీఎస్సార్‌) కింద రాష్ట్రంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడం, వాటిని పక్కాగా పర్యవేక్షించడానికి కనెక్ట్‌ టు ఆంధ్ర అనే లాభాపేక్షలేని సొసైటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎస్సార్‌ కింద నిధులు సమీకరించి నిర్మాణాత్మకంగా విద్య, వైద్య రంగాల్లో వెచ్చించడం ద్వారా మానవ వనరుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటుచేసేందుకు వీలుగా సర్కారు జీవో జారీచేసింది. ప్రతి సంస్థ ఏటా వచ్చే నికర లాభంలో రెండు శాతం మొత్తాన్ని తప్పనిసరిగా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద సేవా కార్యక్రమాలకు వెచ్చించాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం కనెక్ట్‌ టు ఆంధ్ర ను ఏర్పాటు చేయడం ద్వారా సీఎస్సార్‌ కార్యక్రమాలను విస్తృతం చేయాలని ప్రణాళిక రూపొందించింది.

ప్రత్యేక విభాగం ఏర్పాటు ..

ప్రణాళిక విభాగం కింద ఉప కార్యదర్శి/ సంయుక్త కార్యదర్శి హోదా అధికారి ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా ఉండేలా కనెక్ట్‌ టు ఆంధ్ర ప్రత్యేక విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సీఎస్సార్‌కు సంబంధించిన నిధుల సేకరణ, పటిష్ట పర్యవేక్షణ దీని బాధ్యతలు. ప్రభుత్వ పథకాలైన నవరత్నాలు కింద విద్య, వైద్య రంగాల్లో ఈ నిధులను వినియోగించనుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :