ASBL NSL Infratech

తెలుగుదేశం పార్టీలో చేరిన సీనియర్ నటి దివ్యవాణి

తెలుగుదేశం పార్టీలో చేరిన సీనియర్ నటి దివ్యవాణి

దివ్యవాణిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
మాజీ ఐ.ఆర్.ఎస్. అధికారి ఉప్పులేటి దేవీప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరిక 
పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన భర్త ఉప్పులేటి దేవీప్రసాద్ 

ఉండవల్లి ప్రజావేదికలో దేవీప్రసాద్ కు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు. దేవీప్రసాద్ తో తెదేపాలో చేరిన వివిధ క్రిష్టియన్, ముస్లిం మత, కుల పెద్దలు. మాలమహాసభ, మాలక్రిష్టియన్ రైట్స్ ఫోరం, కాపునాడు సభ్యులు, మాజీ పామర్రు పంచాయతీ సభ్యుడు ఎం.డి.అసంతుల్లా, మాజీ ఏఎసైలు తెదేపాలో చేరిక. పామర్రుకు చెందిన వందలమంది బీజేపీ, వైకాపా పార్టీల స్థానిక నాయకులు, కార్యకర్తలు 34 ఏళ్ళపాటు ఆదాయపన్ను శాఖలో విధులు నిర్వహించిన దేవీప్రసాద్. 2015లో ఏపీ ప్రభుత్వం నుంచి దళితరత్న అవార్డును అందుకున్న దేవీప్రసాద్. 2016లో కేంద్రప్రభుత్వం నుంచి నేషనల్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డును అందుకున్న దేవీప్రసాద్.

సినీ నటి దివ్యవాణి, మాజీ ఐ.ఆర్.ఎస్. అధికారి ఉప్పులేటి దేవీప్రసాద్ లు తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాను, అభినందిస్తున్నాను. సమాజ సేవ చేయాలని కాంక్షించే వ్యక్తులు,తమ అనుయాయులతో తెలుగుదేశం పార్టీలో చేరాలనుకోవడం సంతోషదాయకమన్నారు. విభజన కష్టాలున్నప్పటికీ ఈ నాలుగున్నరేల్లలో ఆంధ్రప్రదేశ్ లో ఎంతో అభివృద్ధి సాధించామని గుర్తు చేశారు. ``మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వారు తెలుగుదేశంపార్టీలో చేరాలనుకోవడం, అండగా నిలవాలనుకోవడం అభినందనీయం. రాష్ట్ర విభజన తర్వాత ఎదురైన కష్టాలను ఒక్కోటీ అధిగమించి ముందుకు సాగుతున్నాం. సమర్థవంతమైన పాలనను అందించి రాష్ట్రాభివృద్ధిని గాడిలో పెట్టాం. కేంద్రం సహకరించక పోయినా ప్రజల, అధికారుల సహకారంతో అభివృద్ధిని చేసుకోగలిగాం. తాత్కాలిక, దీర్ఘకాలిక పనులను నిర్దేశించుకుని ప్రాధాన్యక్రమంలో పూర్తీ చేయగలుతున్నాం.

ఆర్ధిక సుస్థిరతతోపాటు ఎకనామిక్ గ్రోత్ చూపించ గలిగాం. సుపరిపాలన ద్వారా పేదలకు అండగా నిలవగలిగాం. బడుగుబలహీన మైనారిటీ వర్గాలను అన్ని విధాల ఆదుకోవడానికి సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యమిచ్చాం. ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉన్నతికి చేదోడువాదోడుగా ఉండటానికి పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. వివిధ వర్గాలు, పేదలు తెలుగుదేశం పార్టీ లో చేరి సహకరం అందించాలి. దివ్యవాణి అమెరికా నుంచి ఇటీవల వచ్చి పేదలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తున్నానన్నారు . భావితరాల బంగారు భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీతో కలసి రావాలన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :