4th November 2026

_________

- Bhuvana

మీ పిల్లలు మీతో మనసు విప్పి మాట్లాడట్లేదా? కారణాలు ఇవే!

తాము చెప్పిన విషయానికి వెంటనే విమర్శలు, మందలింపులు వస్తాయని భావిస్తే పిల్లలు నెమ్మదిగా మాట్లాడటం తగ్గిస్తారు.

తీర్పు చెబుతారనే భయం

పిల్లలు చెప్పేది పూర్తిగా వినకముందే సలహాలు ఇవ్వడం లేదా ఉపన్యాసం చేయడం వల్ల వారు తమ భావాలను దాచుకోవడం ప్రారంభిస్తారు. 

వినకుండా సలహాలు ఇవ్వడం

రోజూ కొన్ని నిమిషాలు కూడా ప్రశాంతంగా మాట్లాడే సమయం లేకపోతే పిల్లలు తమ సమస్యలను స్నేహితులతోనే పంచుకునే అవకాశం ఎక్కువ.

సమయం లేకపోవడం

ఇతర పిల్లలతో తరచూ పోల్చడం పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. దీంతో తమ భావాలను చెప్పడానికి కూడా వెనుకాడుతారు.

ఎప్పుడూ పోల్చడం

చిన్న విషయానికే కోపం, అరుపులు ఉంటే పిల్లలు నిజం చెప్పడం కంటే మౌనంగా ఉండటాన్నే సురక్షితంగా భావిస్తారు.

కోపంగా స్పందించడం

ఎక్కువ స్క్రీన్ టైమ్ వల్ల కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయం తగ్గుతుంది. దీంతో భావోద్వేగ అనుబంధం కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉంది.

మొబైల్, సోషల్ మీడియా ప్రభావం