2nd November 2026

_________

- Bhuvana

చిన్న స్థలంలోనే పండ్ల తోట.. కుండీల్లో పెంచుకోగల బెస్ట్ చెట్లు ఇవే!

నిమ్మ మొక్క చిన్న స్థలాల్లో కూడా పెరుగుతుంది. మంచి సూర్యకాంతి, సరైన నీరు అందిస్తే కుండీలోనే తాజా నిమ్మకాయలు పొందవచ్చు.

నిమ్మ చెట్టు 

జామ మొక్కను పెద్ద కుండీలో పెంచుకోవచ్చు. క్రమం తప్పకుండా కత్తిరింపులు చేస్తే తక్కువ స్థలంలోనే ఆరోగ్యంగా పెరుగుతుంది.

జామ చెట్టు

దానిమ్మ మొక్కలు కుండీల్లో బాగా పెరుగుతాయి. ఎక్కువ సూర్యకాంతి, మంచి డ్రైనేజీ ఉన్న మట్టి అందిస్తే పండ్లు వచ్చే అవకాశం ఉంటుంది.

దానిమ్మ చెట్టు

అమ్రపాలి వంటి డ్వార్ఫ్ మామిడి రకాలు పెద్ద స్థలం లేకున్నా పెద్ద కుండీల్లో పెంచుకోవచ్చు. సరైన సంరక్షణ అవసరం.

మరుగుజ్జు మామిడి చెట్లు

చిన్న ప్రదేశాల్లో పెంచుకోవడానికి బొప్పాయి మంచి ఎంపిక. సరైన ఎండ, నీరు అందిస్తే తక్కువ సమయంలోనే ఫలాలు అందిస్తుంది.

బొప్పాయి

అంజీర్ మొక్క వేర్లకు పరిమిత స్థలం ఉన్నా బాగా పెరుగుతుంది. బాల్కనీ, టెర్రస్ గార్డెన్‌లకు ఇది మంచి ఎంపిక.

అంజీర్