26th October 2026

_________

- Bhuvana

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ హై ప్రోటీన్ ఫుడ్స్ ట్రై చేయండి!

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? ఆకలిని అణచిపెట్టి, కండరాలు కరిగిపోకుండా శరీరానికి కావలసిన శక్తినిచ్చే అద్భుతమైన హై-ప్రొటీన్ ఫుడ్స్ ఇవే!

ఉదయం అల్పాహారంలో గుడ్లు తీసుకోవడం వల్ల ప్రొటీన్ అందుతుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండిన భావనాన్ని కలిపి, అనవసరమైన స్నాక్స్ తినకుండా అడ్డుకుంటుంది.

ఉడకబెట్టిన గుడ్లు

శాకాహారులకు పనీర్ అత్యుత్తమ ప్రొటీన్ వనరు. దీన్ని తక్కువ నూనెతో వండుకుని తింటే జీర్ణక్రియ మందగించి, శరీరానికి కావలసిన శక్తి క్రమంగా అందుతుంది.

పనీర్

పెసలు, శనగలు వంటి మొలకలలో ప్రొటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువును వేగంగా తగ్గించడంలో మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మొలకెత్తిన గింజలు

మధ్యలో ఆకలి వేసినప్పుడు గుప్పెడు వేరుశనగ పప్పులు లేదా చెక్కర లేని పీనట్ బటర్ తీసుకుంటే, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ప్రొటీన్ అందుతాయి.

పల్లీలు & పీనట్ బటర్

నాన్-వెజ్ ప్రియులు చికెన్ బ్రెస్ట్ లేదా చేపలను ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. ఇవి కొవ్వును కరిగించి, కండరాలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి.

చికెన్ మరియు చేపలు

సాధారణ పెరుగు లేదా ప్రొటీన్ రిచ్ గ్రీక్ యోగర్ట్ తీసుకోవడం వల్ల ప్రేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది పొట్ట దగ్గర కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

పెరుగు మరియు గ్రీక్ యోగర్ట్

సోయా ఉత్పత్తులలో ప్రొటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారి డైట్‌లో టోఫు లేదా సోయా చంక్స్ చేర్చుకోవడం వల్ల త్వరగా ఫలితం ఉంటుంది.

సోయా గింజలు & టోఫు

డైటింగ్ సమయంలో నీరసం రాకుండా ఉండటానికి బాదం, చియా సీడ్స్, గుమ్మడి గింజలను స్నాక్స్‌గా తీసుకుంటే ప్రొటీన్ మరియు శక్తి రెండు లభిస్తాయి.

బాదం & గుమ్మడి గింజలు

కేవలం తిండి మానేయడం కంటే, ఈ హై-ప్రొటీన్ ఆహారాలను సరైన మోతాదులో తీసుకుంటూ ఆరోగ్యంగా బరువు తగ్గండి!