బాటిల్‌ను శుభ్రం చేసి పాస్టెల్ రంగులతో పెయింట్ చేయండి లేదా జనపనార తాడుతో చుట్టండి. తాజా లేదా కృత్రిమ పూలతో అద్భుతమైన వాజ్ సిద్ధం.
ఫ్లవర్ వాజ్గా మార్చండి
పారదర్శక గ్లాస్ బాటిల్లో బ్యాటరీ ఫెయిరీ లైట్స్ వేస్తే బెడ్రూమ్, లివింగ్ రూమ్ లేదా బాల్కనీకి హాయిగా కనిపించే డెకార్ లభిస్తుంది.
ఫెయిరీ లైట్ బాటిల్
బాటిల్ చుట్టూ జూట్ రోప్ అతికించి లేస్, చిన్న ముత్యాలు లేదా రిబ్బన్లు జోడిస్తే రస్టిక్ స్టైల్ హ్యాండ్‌మేడ్ డెకార్ సిద్ధమవుతుంది.
జూట్ రోప్ డెకరేషన్
అక్రిలిక్ లేదా గ్లాస్ పెయింట్‌తో ఫ్లోరల్, జ్యామెట్రిక్ లేదా అబ్స్ట్రాక్ట్ డిజైన్లు వేస్తే మీ ఇంటీరియర్‌కు తగ్గ ప్రత్యేక అలంకరణ తయారవుతుంది.
కలర్‌ఫుల్ పెయింటెడ్ బాటిల్స్
మనీ ప్లాంట్ వంటి నీటిలో పెరిగే మొక్కలను గ్లాస్ బాటిల్లో పెంచితే సహజసిద్ధమైన గ్రీన్ డెకార్‌తో గది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఇండోర్ ప్లాంట్ హోల్డర్
మూడు లేదా నాలుగు బాటిళ్లలో రంగురంగుల రాళ్లు, ఇసుక లేదా పూలు వేసి ట్రేలో అమర్చితే డైనింగ్ టేబుల్‌కు స్టైలిష్ సెంటర్‌పీస్ సిద్ధమవుతుంది.
టేబుల్ సెంటర్‌పీస్
గ్లాస్ బాటిళ్లను LED క్యాండిల్స్ లేదా టేపర్ క్యాండిల్స్‌తో అలంకరిస్తే సాయంత్రం వేళ ఇంట్లో హాయిగా కనిపించే అంబియన్స్ ఏర్పడుతుంది.
క్యాండిల్ హోల్డర్