తెలుపు లేదా పాస్టెల్ షీర్ కర్టెన్లను బెడ్‌పై వేలాడదీస్తే గది విశాలంగా, మృదువైన వెలుతురుతో ప్రశాంతంగా కనిపిస్తుంది.
షీర్ కర్టెన్ కానోపీ
ఎంబ్రాయిడరీ హూప్ లేదా మెటల్ రింగ్‌కు ఫ్యాబ్రిక్ అమర్చి బెడ్ మధ్యలో వేలాడదీయండి. ఇది మోడ్రన్తో పాటు రొమాంటిక్ లుక్ ఇస్తుంది.
హూప్ కానోపీ డిజైన్
తేలికైన పాత చీర లేదా దుపట్టాను కానోపీగా ఉపయోగిస్తే తక్కువ ఖర్చుతో భారతీయ శైలిలో అందమైన బెడ్రూమ్ డెకార్ సిద్ధమవుతుంది.
పాత చీరతో కానోపీ
కానోపీకి వార్మ్ LED ఫెయిరీ లైట్స్ జోడిస్తే రాత్రివేళ హోటల్ స్టైల్ అంబియన్స్ ఏర్పడి గది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఫెయిరీ లైట్స్‌తో మ్యాజిక్
బెడ్ నాలుగు వైపులా కర్టెన్ రాడ్స్ అమర్చి ఫ్యాబ్రిక్ వేలాడదీస్తే క్లాసిక్ ఫోర్-పోస్టర్ బెడ్ లుక్‌ను సులభంగా పొందవచ్చు.
కర్టెన్ రాడ్ కానోపీ
మాక్రమే, కాటన్ టాసెల్స్, ఇండోర్ ప్లాంట్స్‌తో కానోపీని అలంకరిస్తే ట్రెండీ బోహో బెడ్రూమ్ వాతావరణం సులభంగా వస్తుంది.
బోహో స్టైల్ కానోపీ
అడ్హీసివ్ హుక్స్ లేదా టెన్షన్ రాడ్స్‌తో డ్రిల్లింగ్ లేకుండానే కానోపీ ఏర్పాటు చేసి గోడలకు ఎలాంటి నష్టం లేకుండా డెకరేట్ చేయవచ్చు.
రెంటల్ హోమ్‌లకు నో-డ్రిల్ ఐడియా
కాటన్, లినెన్ లేదా షీర్ ఫ్యాబ్రిక్ ఉపయోగిస్తే కానోపీ అందంగా పడటమే కాకుండా గదిలో గాలి, వెలుతురు కూడా బాగా ప్రసరిస్తాయి.
సరైన ఫ్యాబ్రిక్ ఎంపిక