15th October 2026

_________

- Bhuvana

నవరాత్రికి ఉల్లి, వెల్లుల్లి లేని వంటలు

ఉల్లి, వెల్లుల్లి లేకుండా టమాటో, పసుపు, కరివేపాకు, నువ్వులు, వేరుశెనగతో చేసే టమాటో పులిహోర నైవేద్యానికి, భోజనానికి అద్భుతంగా ఉంటుంది.

టమాటో పులిహోర

ఉడికించిన బంగాళాదుంపలను జీలకర్ర, మిరియాల పొడి, కొత్తిమీరతో వేయిస్తే సింపుల్‌గా, రుచిగా ఉండే సాత్విక కూర సిద్ధమవుతుంది.

ఆలూ జీరా

బియ్యం, పెసరపప్పు, అల్లం, జీలకర్ర, నెయ్యితో చేసిన ఖిచ్డీ తేలికగా జీర్ణమై నవరాత్రి రోజుల్లో ఆరోగ్యకరమైన భోజనంగా ఉంటుంది.

పెసరపప్పు ఖిచ్డీ

నిమ్మరసం, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు తాలింపుతో చేసే నిమ్మకాయ అన్నం రుచిగా ఉండటంతో పాటు నైవేద్యానికి కూడా అనుకూలం.

నిమ్మకాయ అన్నం

తాజా కొబ్బరి తురుము, జీడిపప్పు, కరివేపాకు, నెయ్యితో తయారయ్యే కొబ్బరి అన్నం పండుగ రోజుల్లో ప్రత్యేక రుచిని అందిస్తుంది.

కొబ్బరి అన్నం

చల్లటి పెరుగు, తాలింపు, దానిమ్మ గింజలు లేదా ద్రాక్షతో చేసిన పెరుగు అన్నం శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే సాత్విక వంటకం.

పెరుగు అన్నం

రవ్వ, నెయ్యి, పాలు, చక్కెర, యాలకుల పొడి, జీడిపప్పుతో చేసే కేసరి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి మంచి స్వీట్.

రవ్వ కేసరి

పాలు, సేమ్యా లేదా సగ్గుబియ్యం, బెల్లం లేదా చక్కెర, యాలకులు, డ్రైఫ్రూట్స్‌తో చేసే పాయసం ప్రతి నవరాత్రి వేడుకలో ప్రత్యేక స్థానం పొందుతుంది.

పాయసం