15th October 2026

_________

- Bhuvana

అమెరికా వెళ్లాలంటే ఏ వీసా తీసుకోవాలి?

టూరిస్ట్‌గా వెళ్లాలన్నా.. చదువుకోవాలన్నా.. ఉద్యోగం చేయాలన్నా.. గ్రీన్ కార్డ్ పొందాలన్నా! మీ అవసరాన్ని బట్టి సరైన US వీసా ఎంచుకోవాలి.

అమెరికా వెళ్లాలనుకుంటున్నారా?

B-1: వ్యాపార పనులకు. B-2: పర్యాటకం, బంధువుల సందర్శనకు.,వైద్య చికిత్సల కోసం.

టూరిస్ట్ వీసా

F-1: యూనివర్సిటీ చదువులకు. M-1: వృత్తి విద్యకు. J-1: ఎక్స్ఛేంజ్, శిక్షణ కార్యక్రమాలకు.

స్టూడెంట్ వీసాలు

అమెరికాలో ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల కోసం ఈ వీసా ఉపయోగపడుతుంది. సాధారణంగా కంపెనీ స్పాన్సర్‌షిప్ అవసరం.

H-1B వీసా

L-1: కంపెనీల మధ్య ఉద్యోగుల బదిలీకి. O-1: అసాధారణ ప్రతిభ ఉన్నవారికి. R-1: అర్హత కలిగిన మతపరమైన ఉద్యోగులకు.

ఇతర వర్క్ వీసాలు

H-4: అర్హత కలిగిన H వీసాదారుల కుటుంబ సభ్యులకు. L-2: L-1 వీసాదారుల కుటుంబ సభ్యులకు.

ఫ్యామిలీ వీసాలు

అమెరికా పౌరుడిని వివాహం చేసుకోబోయే విదేశీ వ్యక్తి కోసం ఈ వీసా ఉద్దేశించారు.

K-1 వీసా

అమెరికాలో శాశ్వత నివాసం కోసం కుటుంబ సంబంధాలు, ఉద్యోగ అర్హతలు వంటి మార్గాలు ఉన్నాయి.

గ్రీన్ కార్డ్

EB-1: ప్రత్యేక ప్రతిభ. EB-2: ఉన్నత విద్యార్హతలు. EB-3: నైపుణ్యం కలిగిన ఉద్యోగులు. EB-4: ప్రత్యేక వలసదారులు. EB-5: అర్హత కలిగిన పెట్టుబడిదారులు.

EB-1 నుంచి EB-5 వరకు

వీసా గడువు, అమెరికాలో ఉండే గడువు వేర్వేరు. దరఖాస్తుకు ముందు తాజా నిబంధనలు తెలుసుకోండి.

వీసా అప్లై చేసే ముందు జాగ్రత్త!