13th October 2026

_________

- Bhuvana

జుట్టు చిక్కులు పడకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు

కండిషనర్ జుట్టును మృదువుగా చేసి చిక్కులు తగ్గిస్తుంది. ముఖ్యంగా జుట్టు చివర్లకు అప్లై చేస్తే దువ్వుకోవడం సులభమవుతుంది.

ప్రతి హెయిర్ వాష్ తర్వాత కండిషనర్ తప్పనిసరి

తడి జుట్టు బలహీనంగా ఉంటుంది. వెడల్పాటి దంతాలు ఉన్న దువ్వెనతో చివర్ల నుంచి నెమ్మదిగా దువ్వితే చిక్కులు, విరిగిపోవడం తగ్గుతుంది.

వెట్ హెయిర్‌ను జాగ్రత్తగా దువ్వండి

షాంపూ చేసే ముందు జుట్టును ఒకసారి దువ్వితే వాష్ తర్వాత ఎక్కువ చిక్కులు పడకుండా ఉండటానికి సహాయపడుతుంది.

తలస్నానం ముందు జుట్టు దువ్వండి

స్ట్రెయిటనర్, కర్లర్, బ్లో డ్రైయర్‌ను తరచూ వాడితే జుట్టు పొడిబారి చిక్కులు ఎక్కువ అవుతాయి. అవసరమైతే హీట్ ప్రొటెక్టెంట్ వాడండి. 

హీట్ స్టైలింగ్‌ను తగ్గించండి

జుట్టును గట్టిగా రుద్దకుండా మృదువుగా తుడవాలి. దీంతో జుట్టు క్యూటికల్ దెబ్బతినకుండా చిక్కులు తగ్గుతాయి.

మైక్రోఫైబర్ టవల్ లేదా కాటన్ టీషర్ట్ వాడండి

పొడవాటి జుట్టును వదిలేసి పడుకుంటే ఘర్షణ వల్ల చిక్కులు పడతాయి. లూజ్ బ్రెయిడ్ లేదా పోనీటెయిల్ వేసుకోవడం మంచిది.

రాత్రి పడుకునే ముందు జడ వేయండి

డ్రై లేదా ఫ్రిజ్జీ హెయిర్ ఉంటే లీవ్-ఇన్ కండిషనర్ లేదా హెయిర్ సీరమ్ వాడటం వల్ల జుట్టు సాఫ్ట్‌గా ఉండి చిక్కులు తగ్గుతాయి.

లీవ్-ఇన్ సీరమ్ ఉపయోగించండి

స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువైతే జుట్టు ఒకదానికొకటి చిక్కుకుంటుంది. 8–12 వారాలకు ఒకసారి ట్రిమ్ చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

చివర్లు క్రమం తప్పకుండా ట్రిమ్ చేయండి