శరీరానికి సరైన ఆకృతిని, బలాన్ని ఇచ్చే వెన్నెముక ఆరోగ్యం చాలా ముఖ్యం. రోజువారీ జీవితంలో మనం పాటించాల్సిన సరైన పోశ్చర్ (భంగిమ) టిప్స్ ఏంటో చూద్దాం!
నిలబడినప్పుడు శరీరం బరువును రెండు కాళ్లపై సమానంగా మోపాలి. భుజాలను వెనుకకు ఉంచి, తలను నిటారుగా ఉంచడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గతుంది.
నిలబడే సరైన భంగిమ
కుర్చీలో కూర్చున్నప్పుడు వెన్నుపూస పూర్తిగా కుర్చీ ఆసరాకు ఆని ఉండేలా చూసుకోవాలి. కాళ్లను నేలపై సమానంగా ఉంచాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్లు మడతపెట్టి కూర్చోకూడదు.
కూర్చునే విధానం
కంప్యూటర్ లేదా ఫోన్ చూసేటప్పుడు స్క్రీన్ కంటి చూపునకు సమానంగా ఉండాలి. తలను ఎక్కువగా కిందికి వంచడం వల్ల మెడ మరియు వెన్నెముక నొప్పులు వస్తాయి.
ల్యాప్‌టాప్ లేదా స్క్రీన్ పొజిషన్
కింద ఉన్న బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు నేరుగా నడుము వంచకూడదు. మోకాళ్లను కొద్దిగా వంచి, కాళ్ల బలంతో వస్తువును పైకి ఎత్తాలి.
బరువైన వస్తువులు ఎత్తేటప్పుడు
ఫోన్ చూసే సమయంలో మెడను పూర్తిగా వంచకుండా, ఫోన్‌ను కొద్దిగా పైకి ఎత్తి కంటి చూపునకు ఎదురుగా పెట్టుకుని చూడటం మంచి అలవాటు.
మొబైల్ వాడే అలవాటు
పడుకునేటప్పుడు వెన్నెముకకు సరైన మద్దతునిచ్చే గట్టిగా ఉండే పరుపును ఉపయోగించాలి. బోర్లా పడుకోవడానికి బదులుగా వెల్లకిలా లేదా ప్రక్కకు తిరిగి పడుకోవడం ఉత్తమం.
నిద్రపోయే భంగిమ
ఎక్కువ గంటలు ఒకే చోట కూర్చుని పనిచేసేవారు ప్రతి గంటకు ఒకసారి లేచి చిన్నగా నడవాలి. ఇది కండరాలు రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది.
ఎక్కువ సేపు కూర్చోవడం తగ్గించండి
యోగా లేదా తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం ద్వారా వెన్నెముక కండరాలు బలపడి వంకర పోకుండా ఆరోగ్యంగా ఉంటాయి.
వెన్నెముకకు వ్యాయామాలు
రోజువారీ పనుల్లో ఈ చిన్నపాటి పోశ్చర్ మార్పులను పాటించడం ద్వారా వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచుకుని నొప్పులకు దూరంగా ఉండండి!