ప్రియమైన వారికి బహుమతులు ఇవ్వడం మన సంప్రదాయం. కేవలం వస్తువులే కాకుండా, శుభాన్ని తెచ్చే మొక్కలను బహుమతిగా ఇస్తే ఆ ఆనందమే వేరు!
మనీ ప్లాంట్‌ను గిఫ్ట్‌గా ఇస్తే ఇంట్లో సిరిసంపదలు, సానుకూల శక్తి పెరుగుతాయని నమ్ముతారు. ఇది ఎవరికైనా ఇవ్వడానికి చక్కటి ఎంపిక.
మనీ ప్లాంట్
అదృష్టాన్ని మరియు శ్రేయస్సును తెచ్చే లక్కీ బాంబూ మొక్కను గిఫ్ట్‌గా ఇస్తే ఇటు ఇంటర్య్ ఆఫీస్ డెకర్‌కి కూడా చాలా బాగుంటుంది.
లక్కీ బాంబూ
జేడ్ ప్లాంట్‌ను సంపదను మరియు వ్యాపార వృద్ధిని ఆకర్షించే మొక్కగా భావిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి దీన్ని బహుమతిగా ఇవ్వవచ్చు.
జేడ్ ప్లాంట్
ఇంట్లో ప్రశాంతతను, సానుకూల వాతావరణాన్ని పెంపొందించే పీస్ లిల్లీ మొక్క బంధాలను మరింత బలపరుస్తుందని నమ్ముతారు.
పీస్ లిల్లీ
గాలిని శుద్ధి చేసే స్నేక్ ప్లాంట్ ఇంటికి మంచి ఆరోగ్యాన్ని, రక్షణను తెస్తుందని నమ్ముతారు. ఇది ఇన్‌డోర్ పెంచడానికి చాలా సులువు.
స్నేక్ ప్లాంట్
అందమైన ఆర్కిడ్ పూల మొక్కలు ప్రేమ, విలాసవంతమైన జీవితం మరియు శుభప్రదమైన సంకేతానికి ప్రతీకగా నిలుస్తాయి.
ఆర్కిడ్ పూల మొక్క
పవిత్రమైన తులసి మొక్కను గృహప్రవేశం లేదా శుభకార్యాల సమయంలో బహుమతిగా ఇవ్వడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి నిలుస్తుంది.
తులసి మొక్క
ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్న అలోవెరా మొక్కను గిఫ్ట్‌గా ఇవ్వడం ద్వారా మీ ప్రియమైనవారి ఆరోగ్యం పట్ల మీ శ్రద్ధను చూపవచ్చు.
అలోవెరా
పచ్చదనంతో పాటు శుభాన్ని, అదృష్టాన్ని పంచే ఈ మొక్కలను మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇచ్చి వారి ముఖంలో చిరునవ్వు చూడండి!