ఉదయాన్నే నిద్రలేవగానే శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడానికి కొన్ని సింపుల్ యోగా ఆసనాలు వేయడం చాలా మంచిది. అవేంటో చూద్దాం!
మోకాళ్లపై కూర్చుని ముందుకు వంగి చేతులను చాచాలి. ఇది మెదడుకు ప్రశాంతతనుఇచ్చి ఒత్తిడిని తగ్గిస్తుంది.
బాలసాననం
పిల్లిలా శరీరాన్ని వంపు తిప్పుతూ చేసే ఈ ఆసనం వెన్నుపూసను వంచడానికి మరియు వెన్నునొప్పి నివారణకు సహాయపడుతుంది.
మార్జాలాసనం
పొట్టపై పడుకుని పైభాగాన్ని పైకి ఎత్తాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి ఉదర భాగంలో కొవ్వును తగ్గిస్తుంది.
భూజంగాసనం
శరీరాన్ని 'V' ఆకారంలో పైకి ఎత్తాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి చేతులు, కాళ్లకు బలాన్నిస్తుంది.
అధో ముఖ శ్వాసనాసనం
కాళ్ళు విడదీసి నిలబడి పక్కకు వంగాలి. ఇది శరీర సమతుల్యతను పెంచి నడుము చుట్టూ ఉన్న కొవ్వును కరిగిస్తుంది.
త్రియోనాసనం
ఒక కాలిపై నిలబడి మరో కాలిని మోకాలికి ఆనించాలి. ఇది ఏకాగ్రతను పెంచి మనస్సును స్థిరంగా ఉంచుతుంది.
వృక్షాసనం
పద్మాసనంలో లేదా సుఖాసనంలో కూర్చుని లోతైన శ్వాస తీసుకోవాలి. ఇది ప్రశాంతతను మరియు శక్తిని ఇస్తుంది.
సుఖాసనం
ఉదయం పూట అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ప్రాణాయామం
రోజూ ఉదయం కేవలం పది నిమిషాలు ఈ ఆసనాలు వేయడం ద్వారా రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు!