22nd September 2026

_________

- Bhuvana

స్ప్లిట్ ఎండ్స్‌కు చెక్.. జుట్టు చివర్లు చిట్లిపోకుండా ఇలా చేయండి!

ప్రతి 6 నుంచి 8 వారాలకు ఒకసారి జుట్టు చివర్లను కొద్దిగా కత్తిరించడం (Trim) వల్ల స్ప్లిట్ ఎండ్స్ పైకి పాకకుండా ఆపవచ్చు.

క్రమం తప్పకుండా ట్రిమ్ చేయడం

వారానికి రెండుసార్లు కుదుళ్ల నుంచి చివర్ల వరకు మాయిశ్చరైజింగ్ హెయిర్ మాస్క్ వేస్తే జుట్టు పొడిబారకుండా ఉంటుంది.

డీప్ కండిషనింగ్ మాస్క్స్

హెర్ డ్రైయర్స్, స్ట్రైటెనర్స్ వాడేటప్పుడు తప్పనిసరిగా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే ఉపయోగించడం చాలా ముఖ్యం.

వేడి టూల్స్ వాడకం తగ్గించండి

స్నానానికి ముందు జుట్టు చివర్లకు కొబ్బరి లేదా ఆర్గాన్ నూనె రాసి మర్దన చేస్తే తేమ అంది చిట్లిపోవడం తగ్గుతుంది.

కొబ్బరి లేదా ఆర్గాన్ ఆయిల్

తలస్నానం చేశాక టవల్‌తో జుట్టును గట్టిగా రుద్దకూడదు. మెత్తటి మైక్రోఫైబర్ టవల్ లేదా కాటన్ టీ-షర్ట్ వాడాలి.

జుట్టును గట్టిగా రుద్దకండి

కాటన్ దిండ్లకు బదులుగా సిల్క్ లేదా సాటిన్ పిల్లో కేసులు వాడితే ఘర్షణ తగ్గి జుట్టు చివర్లు చిట్లిపోవు.

రాత్రిపూట సిల్క్ పిల్లో వాడండి

శరీరం లోపల నుంచి హైడ్రేటెడ్‌గా ఉంటేనే జుట్టు కుదుళ్లు, చివర్లు ఆరోగ్యంగా ఉండి పగలకుండా నిరోధించబడతాయి.

నీరు ఎక్కువగా తాగడం

సల్ఫేట్ లేని (Sulfate-free) మైల్డ్ షాంపూలను వాడటం వల్ల జుట్టు సహజ నూనెలను కోల్పోకుండా రక్షించబడుతుంది.

కెమికల్ షాంపూలకు దూరం