ఇంట్లోనే రెస్టారెంట్ రుచితో నోట్లో వెన్నలా కరిగిపోయే అద్భుతమైన మలై కోఫ్తా కర్రీ తయారీ విధానం ఇప్పుడు మీ కోసం!
ఉడికించిన బంగాళాదుంప, తురిమిన పన్నీర్, మైదాపిండి, కొద్దిగా జీడిపప్పు ముక్కలు మరియు సరిపడా ఉప్పు తీసుకోవాలి.
కోఫ్తా కోసం కావాల్సిన పదార్థాలు
పన్నీర్, బంగాళాదుంప తురుమును బాగా కలిపి, చిన్న ఉండలుగా చేసి మధ్యలో జీడిపప్పు ఉంచి నూనెలో వేయించుకోవాలి.
మృదువైన కోఫ్తా బాల్స్ తయారీ
ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి మరియు కొన్ని జీడిపప్పులను ఉడికించి మెత్తని పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి.
గ్రేవీ కోసం ఉల్లి, టమాటా పేస్ట్
కడాయిలో నెయ్యి లేదా నూనె వేసి, బిర్యానీ ఆకు, యాలకులు వేసి సిద్ధం చేసిన ఉల్లి-టమాటా పేస్ట్ వేసి వేయించాలి.
క్రిమి గ్రేవీ బేస్ తయారీ
ఈ గ్రేవీలో కారం, ధనియాల పొడి, గరం మసాలా మరియు కొద్దిగా కసూరి మేతి వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
సుగంధ ద్రవ్యాలు మరియు మసాలాలు
గ్రేవీకి రిచ్ లుక్ మరియు టేస్ట్ ఇవ్వడానికి రెండు స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ లేదా మీగడను బాగా కలపాలి.
తాజా మీగడ లేదా ఫ్రెష్ క్రీమ్
గ్రేవీ తయారయ్యాక స్టవ్ ఆఫ్ చేసి, ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ కోఫ్తాలను అందులో మెల్లగా ఉంచాలి.
కోఫ్తాలను కలపడం
చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీర మరియు కొద్దిగా క్రీమ్‌తో కర్రీని అందంగా అలంకరించుకోవాలి.
కొత్తిమీరతో గార్నిషింగ్
నాన్ లేదా పుల్కాల్లోకి అద్భుతంగా ఉండే ఈ రిచ్ మలై కోఫ్తాను మీ ఇంట్లో వారందరికీ వడ్డించి మెప్పు పొందండి!
రెస్టారెంట్ స్టైల్ మలై కోఫ్తా రెడీ