చేతిని ముందుకు చాచి, వేళ్లను పైకి పెట్టి మరో చేత్తో వెనక్కి లాగాలి. ఇది మణికట్టు నరాలపై ఒత్తిడి తగ్గించి తిమ్మిరిని తగ్గిస్తుంది.
మణికట్టు సాగదీయడం
కుర్చీలో కూర్చుని పాదాలను గడియార ముళ్ల దిశలో, ఆ తర్వాత వ్యతిరేక దిశలో తిప్పాలి. ఇది కాళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
చీలమండల రొటేషన్
చేతి వేళ్లను గట్టిగా ముడిచి, ఆ తర్వాత ఒక్కసారిగా విప్పాలి. ఇలా పదిసార్లు చేయడం వల్ల చేతుల్లో రక్త సరఫరా వేగవంతం అవుతుంది.
వేళ్ల ఫ్లెక్సింగ్
నిలబడి మీ మడమలను పైకి లేపుతూ వేళ్లపై నిలబడాలి. ఇలా చేయడం వల్ల కాళ్ల కండరాలు రిలాక్స్ అయ్యి తిమ్మిరి సమస్య త్వరగా తగ్గుతుంది.
దూడ కండరాల వ్యాయామం
మెడను నెమ్మదిగా కుడి వైపునకు, ఎడమ వైపునకు వంచాలి. ఇది మెడ నుండి చేతులకు వెళ్లే నరాలపై ఒత్తిడిని తగ్గించి తిమ్మిరి నుంచి ఉపశమనం ఇస్తుంది.
మెడ వంచే వ్యాయామం
కుర్చీపై కూర్చుని ఒక కాలును సమాంతరంగా ముందుకు చాచి కొద్దిసేపు ఉంచాలి. ఇది పిక్కలు, తొడల భాగంలో తిమ్మిరి రాకుండా నివారిస్తుంది.
కాలు ముందుకు చాచడం
ఇంటిలో కొద్ది నిమిషాల పాటు మీ పాదాల వేళ్లపై నడక సాగించండి. ఇది పాదాల రక్తనాళాలను ఉత్తేజపరిచి తిమ్మిరిని ఇట్టే దూరం చేస్తుంది.
వేళ్ల నడక
రోజూ తగినన్ని నీళ్లు తాగుతూ, తిమ్మిరి వచ్చిన ప్రాంతంలో కొద్దిగా నూనెతో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
హైడ్రేషన్ & మసాజ్