3rd September 2026

_________

- Bhuvana

అరటి తొక్కను పడేయకండి.. చర్మానికి ఇలా ఉపయోగిస్తే ఎన్నో లాభాలు!

అరటిపండు తిని తొక్కను పడేస్తున్నారా? దానిలో ఉండే పోషకాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అరటి తొక్క లోపలి భాగంతో ముఖంపై మెల్లగా మసాజ్ చేస్తే, దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు, మంటను తగ్గిస్తాయి.

మొటిమల నివారణ

కంటి కింద ఉన్న డార్క్ సర్కిల్స్‌పై అరటి తొక్క గుజ్జు రాసి కొద్దిసేపు ఉంచితే మంచి ఫలితం కనిపిస్తుంది.

కంటి కింద నల్లటి వలయాలు

అరటి తొక్కలో విటమిన్ బి, సి, ఇ ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలను తగ్గించి వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు.

ముడతల నివారణ

ఎండ వల్ల నల్లబడిన చర్మంపై అరటి తొక్కను రుద్దడం వల్ల ట్యాన్ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.

సన్ ట్యాన్ తొలగింపు

అరటి తొక్కలో కొద్దిగా పంచదార కలిపి స్ర్కబ్ లా వాడితే చర్మంపై ఉండే మృతకణాలు పూర్తిగా తొలగిపోతాయి.

మృతకణాల తొలగింపు

పొడిబారిన చర్మం గలవారు అరటి తొక్కతో మసాజ్ చేస్తే చర్మానికి కావలసిన సహజమైన తేమ అందుతుంది.

చర్మానికి తేమ

ముఖంపై ఉండే చిన్న చిన్న మచ్చలు, గీతలు క్రమంగా తగ్గిపోవడానికి అరటి తొక్క ఎంతగానో సహాయపడుతుంది.

గాయాల మచ్చలు

దోమలు కుట్టిన చోట లేదా చర్మం దురదగా ఉన్నప్పుడు అరటి తొక్కతో రుద్దితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

దురద నుంచి ఉపశమనం

ఎలాంటి ఖరీదైన క్రీములు వాడకుండా, ఇంట్లోనే అరటి తొక్కతో అందమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని సొంతం చేసుకోండి.

సహజ నిగారింపు