17th August 2026

_________

- Bhuvana

వాచ్‌లా కాదు.. జ్యువెలరీలా కనిపించే ఈ బ్రైడల్ డిజైన్స్‌పై ఓ లుక్కేయండి!

పెళ్లి కూతురి చేతికి అచ్చం బంగారు కంకణంలా కనిపించే ఈ కుందన్ వాచ్ డిజైన్ రాయ్ వెడ్డింగ్స్ కి సరిగ్గా సరిపోతుంది.

రాయల్ కుందన్ లుక్

మధ్యలో వజ్రాలు పొదిగిన ఈ గడియారం వభవం పెంచడమే కాకుండా, ఖరీదైన జ్యువెలరీ ధరించిన అనుభూతిని ఇస్తుంది.

డైమండ్ బ్రేస్‌లెట్ స్టైల్

తెల్లటి ముత్యాల దండలతో అల్లినట్టు ఉండే ఈ వాచ్ మోడ్రన్ లెహంగాలు, ట్రెడిషనల్ చీరలపైకి అదిరిపోతుంది.

పర్ల్స్ మ్యాజిక్

పురాతన దేవాలయ నగల శైలిలో రూపొందించిన ఈ బ్రైడల్ వాచ్ సాంప్రదాయ వధువులకు బెస్ట్ ఛాయిస్.

యాంటిక్ గోల్డ్ ఫినిష్

ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న రోజ్ గోల్డ్ ఫినిష్ జ్యువెలరీ వాచ్ చేతికి అందమైన, ఆకర్షణీయమైన లుక్‌ను ఇస్తుంది.

రోజ్ గోల్డ్ గ్లామర్

పచ్చలు, కెంపులతో అమర్చిన ఈ గడియారం ఖరీదైన నెక్లెస్ సెట్‌ను తలపించేలా ఉంటుంది.

రూబీ అండ్ ఎమరాల్డ్

పూల డిజైన్లతో కూడిన ఈ డెలికేట్ బ్రైడల్ వాచ్ రిసెప్షన్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఫ్లోరల్ కట్ వర్క్

ఒకటికి మించి గొలుసులు ఉన్నట్టు కనిపించే ఈ మల్టీ-లేయర్ వాచ్ సరికొత్త ఫ్యాషన్‌ను పరిచయం చేస్తుంది.

లేయర్డ్ చైన్ డిజైన్

వెండి మెరుపుతో కూడిన ప్లాటినం స్టైల్ వాచ్ మినిమల్ జ్యువెలరీ ఇష్టపడే వధువులకు పర్ఫెక్ట్ గా ఉంటుంది.

ప్లాటినం గ్రేస్

సాంప్రదాయాన్ని, ఆధునికతను మిళితం చేసిన ఈ బ్రైడల్ జ్యువెలరీ వాచెస్ మీ పెళ్లి రోజున ప్రత్యేక నిరుపమాన అందాన్ని తెస్తాయి.

పెళ్లి వేడుకకు పర్ఫెక్ట్