పవిత్రమైన శ్రావణ మాసంలో నోరూరించే ప్రసాదాలు, వంటకాలు చేసుకుంటే ఇల్లంతా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది!
శ్రావణ మాస ప్రత్యేక వంటకాలు
అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం పరమాన్నం. కొత్త బియ్యం, బెల్లం, నెయ్యితో చేసే ఈ తీపి వంటకం ఎప్పుడూ సూపరే.
పరమాన్నం
కొబ్బరి, బెల్లంతో సులభంగా చేసే ఈ లడ్డూలు పూజా నైవేద్యానికి రుచికరమైన ఎంపిక.
కొబ్బరి లడ్డూ
శ్రావణ మాసంలో ఏ నోము నోచినా పూర్ణం బోరెలు ఉండాల్సిందే. శనగపప్పు, బెల్లం పూర్ణంతో చేసే ఈ వంటకం భలే రుచిగా ఉంటుంది.
పూర్ణం బోరెలు
వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం బోరెలు సమర్పిస్తే ఎంతో శుభప్రదంగా భావిస్తారు.
వ్రతాలకు ప్రత్యేకమైనవి
మినపప్పుతో చేసే క్రిస్పీ గారెలు పూజల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి. ఇవి రుచిలోనే కాదు, సంప్రదాయంలోనూ ముఖ్యమైనవి.
అల్లం చట్నీతో గారెలు
పెరుగు, అన్నం, తాలింపుతో చేసే దద్దోజనం సింపుల్గా ఉండటంతో పాటు ప్రసాదంగా కూడా పెట్టవచ్చు.
దద్దోజనం
ఏ పూజ జరిగినా పులిహోర ఉండాల్సిందే. చింతపండు లేదా నిమ్మకాయ పులిహోరను ప్రసాదంగా ఎంతో భక్తితో వండుతారు.
పులిహోర
పెసరపప్పు, బియ్యం, బెల్లం కలగలిపి చేసే చక్ర పొంగలి కమ్మని వాసనతో నోరూరిస్తుంది. ఇది ఎంతో పవిత్రమైన నైవేద్యం.
చక్ర పొంగలి
ఈ శ్రావణ మాసంలో ఈ సాంప్రదాయ వంటకాలను చేసి, కుటుంబంతో కలిసి సంతోషంగా పండుగను ఆస్వాదించండి!
పండుగను ఆస్వాదించండి!