3rd August 2026

_________

- Saidulu

అమ్మ చేతి రుచిని గుర్తు చేసే ఎండు చేపల పులుసు రెసిపీ!

వేడివేడి అన్నంలోకి కాస్త ఎండు చేపల పులుసు వేసుకుని తింటే ఆ రుచే వేరు! చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు.

ఎండు చేపల తలలు తీసేసి, వేడి నీళ్లలో 5 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడగాలి. దీనివల్ల ఇసుక, నీచు వాసన పూర్తిగా పోతాయి.

చేపల శుభ్రత చాలా ముఖ్యం!

ఎండు చేపలు, ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, చింతపండు రసం, పోపు దినుసులు, కారం, పసుపు మరియు కొత్తిమీర సిద్ధం చేసుకోండి.

కావాల్సిన ముఖ్యమైన దినుసులు

బాణలిలో కొద్దిగా నూనె వేసి శుభ్రం చేసిన ఎండు చేపలను దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇది పులుసుకి మంచి రుచిని ఇస్తుంది.

చేపలను లైట్‌గా వేయించండి

అదే బాణలిలో నూనె వేసి జీలకర్ర, మెంతులు, కరివేపాకు, సన్నటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించండి.

ఘుమఘుమలాడే తాళింపు

ఉల్లిపాయలు వేగాక అల్లం-వెల్లుల్లి పేస్ట్, టమోటాలు, పసుపు, సరిపడా కారం, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి.

టమోటా & మసాలాల మ్యాజిక్

మీకిష్టమైతే ఈ దశలో వంకాయ, ములక్కాడ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవి పులుసు రుచిని రెట్టింపు చేస్తాయి.

ములక్కాడ, వంకాయ కలయిక

పులుసు మరుగుతుండగా ముందుగా వేయించిన ఎండు చేపలను వేసి, సన్నని మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.

వేయించిన చేపలు కలపండి

చివరగా కొత్తిమీర చల్లుకుని దించేస్తే కారంగా, పుల్లగా ఉండే ఎండు చేపల పులుసు సిద్ధం! మర్నాటికి ఇంకా రుచిగా ఉంటుంది.