3rd August 2026

_________

- Saidulu

అమ్మమ్మ స్టైల్‌లో టమాటా పప్పు తయారీ రహస్యం!

అమ్మమ్మ స్టైల్ టమాటా పప్పు.. ఆ రుచే వేరు! నోరూరించే ఆ పాత కాలపు సీక్రెట్ రెసిపీ ఏంటో చూద్దాం.

కమ్మటి టమాటా పప్పు కోసం కొత్త కందిపప్పును ఎంచుకోవాలి. ఇది పప్పుకు మంచి గుమగుమలాడే వాసనను ఇస్తుంది.

సరైన పప్పు ఎంపిక..

కందిపప్పును బాగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఎంత మెత్తగా ఉంటే రుచి అంత బాగుంటుంది.

పప్పు ఉడికించే విధానం..

హైబ్రిడ్ కాకుండా చిన్న నాటు టమాటాలను వాడాలి. అప్పుడే అమ్మమ్మ చేసినట్టుగా పప్పు పుల్లపుల్లగా అద్భుతంగా ఉంటుంది.

పుల్లని నాటు టమాటాలు..

టమాటాలతో పాటు కొద్దిగా చింతపండు రసం, పచ్చిమిర్చి వేసి ఉడికిస్తే పప్పు రుచి అమాంతం పెరిగిపోతుంది.

చింతపండు రసం చిట్కా..

ఉడికిన పప్పును మిక్సీలో కాకుండా, పాతకాలపు పప్పు గుత్తితోనే మెదిపితేనే అసలైన పప్పు రుచి వస్తుంది.

పప్పు గుత్తితో మెదపడం..

ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలను నెయ్యిలో వేయించి పోపు పెట్టుకోవాలి. ఇదే అసలైన రహస్యం!

నేతిలో పోపు ఘుమఘుమలు..

పోపులో చిటికెడు ఇంగువ వేయడం వల్ల పప్పు సువాసన ఇంటి నిండా వ్యాపించి, ఆకలిని రెట్టింపు చేస్తుంది.

ఇంగువ సువాసన..

దించే ముందు గుప్పెడు తాజా కొత్తిమీరను చేర్చి కలిపితే పప్పు మరింత రుచిగా, సువాసనగా మారుతుంది.

కొత్తిమీర తురుము..

కమ్మటి నెయ్యి వేసుకుని, ఈ టమాటా పప్పును వేడివేడి అన్నంతో తింటే అమృతంలా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి!

వేడివేడి అన్నంతో..