28th July 2026

_________

- Saidulu

చిన్ననాటి జ్ఞాపకం... నోరూరించే మరమరాల లడ్డూలు ట్రై చేద్దామా?

చిన్నతనంలో స్కూల్ బయట కొనుక్కుని తిన్న మరమరాల లడ్డూలు గుర్తుకొస్తున్నాయా? తక్కువ ఖర్చుతో, క్షణాల్లో ఇంట్లోనే ఎంతో క్రిస్పీగా చేసుకోవచ్చు!

మరమరాలు - 3 కప్పులు, తురిమిన బెల్లం - 1 కప్పు, నెయ్యి - 1 స్పూన్, యాలకుల పొడి - అర స్పూన్, కొద్దిగా నీరు.

కావలసిన పదార్థాలు

స్టవ్ పై కడాయి పెట్టి మరమరాలను 2 నిమిషాలు దోరగా వేయించండి. దీనివల్ల లడ్డూలు చాలా క్రిస్పీగా, రుచిగా వస్తాయి. పక్కన పెట్టుకోండి.

మరమరాల వేయించడం

పాన్‌లో కప్పు బెల్లం, 2 చెంచాల నీరు వేసి కలపండి. బెల్లం పూర్తిగా కరిగాక, ఒక చెంచా నెయ్యి, యాలకుల పొడి వేసి పాకం రానివ్వండి.

బెల్లం పాకం తయారీ

ఒక గిన్నె నీటిలో బెల్లం పాకం వేస్తే అది గట్టి ఉండలా అవ్వాలి. ఉండను కింద వేస్తే సౌండ్ రావాలి. ఇదే సరైన ముదురు పాకం గుర్తు!

పాకం పదును చూసుకోవడం

సరైన పాకం వచ్చాక స్టవ్ ఆపి, వేయించిన మరమరాలను వెంటనే వేసి, బెల్లం పాకం అంతా బాగా పట్టేలా త్వరగా కలపండి.

మరమరాలు కలపడం

కాస్త వేడిగా ఉన్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ గట్టిగా నొక్కుతూ గుండ్రటి లడ్డూలుగా చుట్టుకోండి. చల్లారితే లడ్డూలు రావు.

గుండ్రటి లడ్డూలు చేయండి

లడ్డూలు పూర్తిగా చల్లారాక గాలి చొరబడని డబ్బాలో (Air-tight container) దాచుకుంటే నెల రోజులకు పైగా క్రిస్పీగా, తాజాగా ఉంటాయి!

రుచికరమైన మరమరాల లడ్డూ రెడీ!