తురిమిన పనీర్, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మెంతి, కొత్తిమీర సిద్ధంగా ఉంచుకోండి.
కావలసిన పదార్థాలు
పాన్‌లో నూనె లేదా వెన్న వేడి చేసి జీలకర్ర వేయండి. తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
మసాలా బేస్ తయారీ
టమాటా, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి నూనె విడిచే వరకు ఉడికించండి. ఈ మసాలానే పనీర్ భుర్జీకి రుచిని అందిస్తుంది.
టమాటా మసాలా
తురిమిన తాజా పనీర్‌ను మసాలాలో వేసి మెల్లగా కలపండి. ఎక్కువసేపు ఉడికించకుండా 3–4 నిమిషాలు మాత్రమే ఉంచితే పనీర్ మెత్తగా ఉంటుంది.
పనీర్ కలపడం
చివరగా చేత్తో నలిపిన కసూరి మెంతి, గరం మసాలా వేస్తే రెస్టారెంట్ స్టైల్ ఘుమఘుమలాడే రుచి వస్తుంది.
కసూరి మెంతి సీక్రెట్
ఒక టేబుల్ స్పూన్ తాజా క్రీమ్ లేదా కొద్దిగా వెన్న కలిపితే పనీర్ భుర్జీ మరింత క్రీమీగా, రిచ్ టేస్ట్‌తో ఉంటుంది.
క్రీమీ టచ్
పనీర్ భుర్జీని రోటీ, చపాతీ, పరాటా, బటర్ నాన్ లేదా బ్రెడ్‌తో సర్వ్ చేస్తే అద్భుతమైన రుచి ఆస్వాదించవచ్చు.
దేనితో తింటే బాగుంటుంది?