9th July 2026

__________

- Saidulu

బయట కొనాల్సిన పనిలేదు.. పప్పు చెక్కలు ఇంట్లోనే ఇలా చేయండి!

టీ టైమ్‌కు కరకరలాడే స్నాక్ కావాలా? బయట కొనకుండా రుచికరమైన పప్పు చెక్కలను ఇంట్లోనే సులభంగా తయారు చేయండి.

బియ్యప్పిండి, శనగపప్పు, వెన్న, నువ్వులు, జీలకర్ర, కారం, ఉప్పు, కరివేపాకు, నూనె.

శనగపప్పును ఒక గంట నానబెట్టి నీరు వడగట్టండి. ఇలా చేస్తే వేయించినప్పుడు పప్పు కరకరలాడుతూ రుచిగా ఉంటుంది.

బియ్యప్పిండిలో వెన్న, నువ్వులు, జీలకర్ర, కారం, ఉప్పు, కరివేపాకు, నానబెట్టిన పప్పు వేసి బాగా కలపండి.

కొద్దికొద్దిగా నీరు పోస్తూ మెత్తగా కానీ గట్టిగా కాకుండా పిండిని కలపండి. 10 నిమిషాలు మూతపెట్టి ఉంచండి.

చిన్న ఉండ తీసుకుని ప్లాస్టిక్ షీట్‌పై పలుచగా ఒత్తి కత్తితో చిన్న చతురస్రాలు లేదా డైమండ్ ముక్కలుగా కట్ చేయండి.

వేడి నూనెలో మధ్య మంటపై చెక్కలను నెమ్మదిగా వేయించండి. బంగారు రంగు వచ్చిన తర్వాత బయటకు తీసేయండి.

వేయించిన చెక్కలను టిష్యూపై ఉంచితే అదనపు నూనె తొలగి మరింత కరకరలాడే టెక్స్చర్ వస్తుంది.

పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే పప్పు చెక్కలు చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి.

టీ లేదా కాఫీతో ఈ కరకరలాడే పప్పు చెక్కలను సర్వ్ చేయండి. కుటుంబమంతా ఇష్టపడే సంప్రదాయ రుచి మీ సొంతం!