8th July 2026

__________

- Saidulu

కుండీ చిన్నగా ఉన్నా... మొక్క వేర్లు పడవకుండా ఉండాలంటే ఇలా చేయండి.!

కుండీ చిన్నగా ఉన్నా మొక్క వేర్లు పాడవకుండా, ఆరోగ్యంగా పెరగాలంటే ఈ చిట్కాలు పాటించండి!

చిన్న కుండీ.. పెద్ద మొక్క!

మొక్కను కుండీ నుండి తీసి, చుట్టూ అల్లుకుపోయిన ఎక్స్‌ట్రా వేర్లను లైట్‌గా కత్తిరిస్తే కొత్త వేర్లు వస్తాయి.

వేర్లను కత్తిరించండి

చిన్న కుండీలో మట్టి గట్టిపడకుండా తరచూ పైపైన తవ్వాలి. దీనివల్ల వేర్లకు గాలి, ఆక్సిజన్ బాగా అందుతాయి.

మట్టిని గుల్లగా ఉంచండి

మట్టిలో కోకోపిట్ ఎక్కువగా కలిపితే వేర్లు సులువుగా విస్తరించడానికి, పెరగడానికి తగినంత ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది.

కోకోపిట్ మిశ్రమం

చిన్న కుండీల్లో గట్టి ఎరువుల కంటే లిక్విడ్ ఎరువులు ఇస్తే వేర్లు త్వరగా గ్రహిస్తాయి, ఒత్తిడికి గురికావు.

లిక్విడ్ ఫెర్టిలైజర్స్

చిన్న కుండీలో నీరు అస్సలు నిలవకూడదు. హోల్స్ సరిగ్గా ఉంటేనే వేర్లు కుళ్ళిపోకుండా సురక్షితంగా ఉంటాయి.

నీరు నిలవకుండా

చిన్న కుండీ కాబట్టి రోజూ కుండీ నిండా నీళ్లు పోయకూడదు. మట్టి తేమను బట్టి కొద్దికొద్దిగా నీరు అందించాలి.

తగినంత నీరు మాత్రమే

మొక్క మరీ పెద్దదై వేర్లు బయటకు వస్తుంటే, కొద్దిగా పెద్ద కుండీలోకి మార్చడం వేర్ల ఆరోగ్యానికి మంచిది.

రీపాటింగ్ టైమింగ్

చిన్న కుండీలు త్వరగా వేడెక్కుతాయి. కాబట్టి మధ్యాహ్నం వేళ తీవ్రమైన ఎండ తగలకుండా సెమీ-షేడ్‌లో ఉంచాలి.

ఎండ తీవ్రత నుండి రక్షణ

ఈ చిన్న జాగ్రత్తలతో చిన్న కుండీల్లోనూ మొక్కలను పచ్చగా పెంచవచ్చు. 

వేర్లే మొక్కకు ప్రాణం!