వర్షం పడుతుంటే వేడివేడిగా, కరకరలాడే అమ్మ చేతి సర్వపిండి తింటుంటే వచ్చే ఆ మజానే వేరు కదూ! అందరికీ నచ్చే పాతకాలపు రుచి ఇది.
బియ్యం పిండి, నానబెట్టిన శనగపప్పు, పల్లీలు, నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు మరియు తగినంత నూనె.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో నీరు, ఉప్పు వేసి బాగా మరిగించాలి. నీరు ఎంత బాగా మరిగితే రొట్టెలు అంత సాఫ్ట్‌గా వస్తాయి.
సర్వపిండి వండటానికి మందపాటి గిన్నె లేదా కడాయిని తీసుకోవాలి. అందులో కొద్దిగా నూనె వేసి అడుగు భాగం మొత్తం బాగా రాయాలి.
కలిపిన పిండి ముద్దను గిన్నె మధ్యలో ఉంచి, చేతి వేళ్లతో గిన్నె చుట్టూ పల్చగా, సమానంగా ఉండేలా ఒత్తుకోవాలి.
ఒత్తిన పిండిపై వేలితో అక్కడక్కడా చిన్న రంధ్రాలు చేయాలి. దీనివల్ల వేడి లోపలికి వెళ్లి పిండి అంతా సమానంగా, క్రిస్పీగా కాలుతుంది.
మనం చేసిన ప్రతి రంధ్రంలోనూ కొన్ని చుక్కల నూనెను వేయాలి. ఇది సర్వపిండి అడుగుభాగం చక్కగా కాలేందుకు సహాయపడుతుంది.
గిన్నెపై మూత పెట్టి, స్టవ్ మీద తక్కువ లేదా మీడియం మంటపై 15 నిమిషాల పాటు బంగారు రంగు వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి.
చుట్టూ ఎర్రగా కాలిన తర్వాత సర్వపిండిని గిన్నె నుండి మెల్లగా తీయాలి. అంతే, ఎంతో క్రిస్పీగా ఉండే సర్వపిండి రెడీ!
వేడివేడి సర్వపిండిని సాయంత్రం పూట కప్పు టీతో లేదా పెరుగు, ఆవకాయతో తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి!