సాయంత్రం టీతో కరకరలాడే స్నాక్ తినాలనిపిస్తుందా? బయట కొనాల్సిన అవసరం లేదు.. పొటాటో ట్విస్టర్స్ ఇంట్లోనే సులభంగా చేసేయండి.
బంగాళాదుంపలు, చెక్క కడ్డీలు, నూనె, ఉప్పు, కారం, మిరియాల పొడి, వెల్లుల్లి పొడి, చాట్ మసాలా సిద్ధంగా ఉంచుకోండి.
బంగాళాదుంపకు చెక్క కడ్డీ గుచ్చి పదునైన కత్తితో నెమ్మదిగా స్పైరల్‌గా కట్ చేసి మెల్లగా విడదీయండి.
కట్ చేసిన బంగాళాదుంపలను 15 నిమిషాలు చల్లని నీటిలో నానబెట్టి, తర్వాత బాగా తుడిచి వేయిస్తే మరింత క్రిస్పీగా వస్తాయి.
మధ్యస్థ మంటపై నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఎక్కువ మంటపై వేయిస్తే బయట మాత్రమే వేగుతుంది.
బంగారు రంగు వచ్చే వరకు వేయించండి
వేడి వేడి ట్విస్టర్స్పై చాట్ మసాలా, కారం, మిరియాల పొడి లేదా పెరి పెరి మసాలా చల్లితే రుచి మరింత పెరుగుతుంది.
టమాటో కెచప్, మయోనీజ్, చీజ్ డిప్ లేదా స్పైసీ గార్లిక్ సాస్‌తో వడ్డిస్తే ప్రతి బైట్ మరింత రుచిగా ఉంటుంది.
పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే పొటాటో ట్విస్టర్స్ పార్టీలు, టీ టైమ్, వీకెండ్ స్నాక్స్‌కు అద్భుతమైన ఎంపిక.