24th June 2026

__________

- Saidulu

సొగసరి చేతికి సిల్క్ త్రెడ్ ఎంబ్రాయిడరీ గాజులు... ఎంత రాయల్ లుక్ ఇస్తున్నాయో!

సాధారణ గాజులకు బదులు ఎంబ్రాయిడరీ గాజులు ఎప్పుడైనా ట్రై చేశారా? మీ చేతుల అందాన్ని రెట్టింపు చేసే ఈ సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ చూద్దాం.

గాజుల పైన జార్దోసీ ఎంబ్రాయిడరీ వర్క్ రాజసపు కళను గుర్తుచేస్తుంది. పెళ్లిళ్లు, పేరంటాలలో వధువుల చేతులకు ఈ డిజైన్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి.

రాయల్ జార్దోసీ వర్క్

మృదువైన సిల్క్ దారానికి మెరిసే ముత్యాల అల్లిక! ఈ కాంబినేషన్ మీ చేతులకు రిచ్ లుక్ ఇవ్వడమే కాకుండా ఫ్యాషన్ వరల్డ్ లో బాగా ట్రెండింగ్.

సిల్క్ దారం - ముత్యాలు

అద్దాలు, కుందన్లతో డిజైన్ చేసిన గాజులు పండుగలకు సూపర్ హిట్. నవరాత్రి లాంటి వేడుకల్లో ఇవి మీ పండుగ కళను రెట్టింపు చేస్తాయి.

 మిర్రర్ & కుందన్ వర్క్

లేత రంగులైన పాస్టెల్ కలర్స్ ఈ రోజుల్లో ట్రెండ్. లావెండర్, పీచ్ కలర్ గాజులపై ఎంబ్రాయిడరీ మోడ్రన్ అమ్మాయిల ఫస్ట్ ఛాయిస్.

ట్రెండింగ్ పాస్టెల్ కలర్స్

పెళ్లి వధువులకు మగ్గం వర్క్ గాజులు పర్ఫెక్ట్ మ్యాచ్. కుందన్స్, జరీ దారంతో చేసే ఈ హెవీ డిజైన్స్ చేతులకు చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి.

మగ్గం వర్క్ గాజులు

పంజాబీ సంప్రదాయ కళ అయిన ఫుల్కారీ ఎంబ్రాయిడరీ గాజుల మీద కూడా వస్తోంది. బ్రైడల్ వేర్ లో ఇది ఇప్పుడు చాలా పాపులర్ అవుతోంది.

ఫుల్కారీ ఎంబ్రాయిడరీ

చేతితో వేసిన పూల ఎంబ్రాయిడరీ డిజైన్లు ఉన్న గాజులకు చాలా డిమాండ్ ఉంది. ఈ సన్నని కుట్లు చేతులపై అచ్చం పూలు పూసినట్లు ఉంటాయి.

 ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ

గాజులపై కస్టమైజ్డ్ అక్షరాలు, పేర్లు ఎంబ్రాయిడరీ చేయించుకోవడం లేటెస్ట్ ట్రెండ్. వధువులు తమ పెళ్లి వేడుకలకు వీటినే ఇష్టపడుతున్నారు.

 కస్టమైజ్డ్ ఎంబ్రాయిడరీ

ప్లెయిన్ గాజులతో ఈ ఎంబ్రాయిడరీ మోడల్స్ కలిపి వేసుకుంటే లుక్ అద్భుతంగా వస్తుంది. మరి మీ కలెక్షన్ లోకి వీటిని చేర్చుకుంటారా?