నోట్లో వేస్తే కరిగిపోయే రసగుల్లా అంటే ఇష్టపడని వారుంటారా? పండగైనా, ఫంక్షన్ అయినా ఈ స్వీట్ ఉంటే ఆ మజానే వేరు.
దీని కోసం 1 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు, 2 చెంచాల నిమ్మరసం, 1 కప్పు చక్కెర, మరికొన్ని నీళ్లు ఉంటే సరిపోతుంది.
ముందుగా పాలను బాగా మరిగించాలి. స్టవ్ ఆపి, కొద్దికొద్దిగా నిమ్మరసం వేస్తూ పాలు పూర్తిగా విరిగేలా కలపాలి.
విరిగిన పాలను పల్చటి కాటన్ గుడ్డలో వడకట్టాలి. నిమ్మకాయ పులుపు పోవడానికి ఆ పనీర్‌ను చల్లటి నీటితో బాగా కడగాలి.
గుడ్డను గట్టిగా పిండి నీరంతా తీసేయాలి. ఆపై తేమ పూర్తిగా పోవడానికి ఒక గంట పాటు ఎక్కడైనా వేలాడదీసి ఉంచాలి.
ఇప్పుడు చెన్నాను ఒక ప్లేట్లోకి తీసుకుని, అరచేతితో కనీసం 8-10 నిమిషాల పాటు సాఫ్ట్ ముద్దలా బాగా మర్దనా చేయాలి.
తయారైన పిండి ముద్దను చిన్న చిన్న భాగాలుగా చేసి, ఎక్కడా పగుళ్లు (cracks) లేకుండా గుండ్రటి సాఫ్ట్ ఉండలుగా చుట్టుకోవాలి.
ఒక వెడల్పాటి గిన్నెలో 1 కప్పు చక్కెరకి 4 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. పాకం పల్చగానే (తీగ పాకం వద్దు) ఉండాలి.
మరుగుతున్న పాకంలో రసగుల్లా ఉండలు వేసి, మూత పెట్టి హై ఫ్లేమ్‌పై 15 నిమిషాలు ఉడికిస్తే అవి రెట్టింపు సైజుకు వస్తాయి.
ఉడికిన రసగుల్లాలను 5 గంటలు పాకంలోనే నాననివ్వాలి. ఆపై ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్ చేస్తే జ్యూసీ రసగుల్లా రెడీ!