16th June 2026

__________

- Saidulu

ఘుమఘుమలాడే వాసనకే నోట్లో నీరూరే కొరమీను చేప పులుసు చేద్దాం రండి...

నోరూరించే తెలంగాణ రుచి! ఇల్లంతా ఘుమఘుమలాడే చేపల పులుసు వాసనతో ప్రతి ఒక్కరి మనసు పులకరించిపోతుంది. ఇదో తీపి జ్ఞాపకం!

తాజా కొరమీను ముక్కలు, చింతపండు గుజ్జు, నూరిన ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిర్చి మరియు సుగంధ ద్రవ్యాలు దీనికి ప్రధాన బలం.

కావలసిన పదార్థాలు

కొద్దిగా వేయించిన మెంతి పొడి, జీలకర్ర పొడి చేర్చడం వల్ల ఈ పులుసుకు అద్భుతమైన సువాసన, చిక్కదనం వస్తాయి.

సీక్రెట్ ఇంగ్రిడియంట్

వేడి నూనెలో ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా దోరగా వేయించుకోవడంతో కథ మొదలవుతుంది.

బేస్ తయారీ

వేగిన మసాలాలో చింతపండు రసం, తగినంత కారం, ఉప్పు వేసి, నూనె పైకి తేలే వరకు బాగా మరిగించాలి.

పులుసు మరగడం

మరుగుతున్న పులుసులో చేప ముక్కలు వేసి, విరిగిపోకుండా నెమ్మదిగా కదపాలి. చిన్న మంటపై పది నిమిషాలు ఉంచాలి.

 ముక్కల కలయిక

వండిన వెంటనే తినడం కంటే, రెండు గంటల తర్వాత తింటే ముక్కలకు పులుపు, కారం బాగా పట్టి అమృతంలా ఉంటుంది.

ఆరితేనే అసలు రుచి!

వేడివేడి అన్నంలో ఈ కొరమీను పులుసు వేసుకుని తింటుంటే, ఆ రుచికి ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే. ఇదీ కదా తెలంగాణ స్పెషల్!

వేడి అన్నంతో స్వర్గమే!