11th June 2026

__________

- Saidulu

టీ టైమ్‌కు బెస్ట్ పునుగుల రెసిపీ

సాయంత్రం వేళ టీతో తినేందుకు పునుగులు అంటే అందరికీ ఇష్టం. బయట స్టైల్‌లో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి.

దోశ పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, నూనె ఉంటే చాలు రుచికర పునుగులు సిద్ధం.

కావాల్సిన పదార్థాలు

దోశ పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి బాగా కలిపితే పునుగుల మిశ్రమం సిద్ధమవుతుంది.

పిండిని సిద్ధం చేయండి

కడాయిలో నూనెను మధ్యస్థ మంటపై వేడి చేయాలి. నూనె ఎక్కువ వేడిగా ఉంటే పునుగులు లోపల ఉడకవు.

నూనె వేడి చేయండి

చేతితో లేదా స్పూన్‌తో చిన్న ముద్దలుగా పిండిని నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

పునుగులు వేయించే విధానం

కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ లేదా అల్లం చట్నీతో పునుగులు తింటే రుచి మరింత పెరుగుతుంది.

బెస్ట్ కాంబినేషన్

పిండిలో కొద్దిగా బియ్యంపిండి కలిపితే పునుగులు మరింత కరకరలాడుతూ రెస్టారెంట్ స్టైల్ రుచిని ఇస్తాయి. 

సీక్రెట్ చిట్కా

తక్కువ నూనెతో పునుగులు చేయాలంటే పనియారం పాన్ ఉపయోగించండి. రుచి కూడా అలాగే ఉంటుంది.

హెల్తీ పునుగులు