ఉదయం వేళ హడావిడి లేకుండా కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే టేస్టీ అండ్ హెల్తీ ఆఫీస్ లంచ్ ఐడియాస్ ఇక్కడ చూడండి.
రాత్రి మిగిలిన అన్నంతో లేదా వేడి అన్నంతో ఐదు నిమిషాల్లో పోపు వేసి కమ్మని నిమ్మకాయ పులిహోరను రెడీ చేసుకోవచ్చు.
కీరా, టొమాటో, క్యారెట్ ముక్కల్లో కాస్త పనీర్, నిమ్మరసం, మిరియాల పొడి కలిపితే ప్రోటీన్ రిచ్ లంచ్ సిద్ధం.
చపాతీలో పనీర్ ముక్కలు, క్యాప్సికమ్ మరియు మీకు నచ్చిన సాస్ వేసి రోల్ చేస్తే ఈజీ లంచ్ బాక్స్ రెడీ.
కొద్దిగా ఆయిల్, గుడ్లు, రైస్ మరియు మసాలాలు వేసి హై ఫ్లేమ్‌పై టాస్ చేస్తే క్విక్ ఎగ్ రైస్ సిద్ధం.
అన్నంలో పెరుగు, కాస్త పాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలతో తిరగమాత వేస్తే కడుపుకు ఎంతో హాయిగా ఉంటుంది.
కూరగాయల ముక్కలతో ఓట్స్‌ను ఉడికించి చేసే ఈ ఉప్మా బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆఫీస్ లంచ్.
బ్రెడ్ స్లైసెస్ మధ్య చీజ్, టొమాటో, ఉల్లిపాయ ముక్కలు పెట్టి టోస్ట్ చేస్తే ఐదు నిమిషాల్లో లంచ్ రెడీ.