ఫైబర్, ప్రోటీన్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండేచియా సీడ్స్ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
చియా సీడ్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం లెమన్ వాటర్ తో తాగవచ్చు. ఇది శరీరానికి హైడ్రేషన్ అందించడంతో పాటు జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
పండ్ల స్మూతీలలో ఒక స్పూన్ చియా సీడ్స్ కలిపితే పోషక విలువలు పెరుగుతాయి. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది.
పెరుగు లేదా కర్డ్‌లో చియా సీడ్స్ కలిపి తీసుకోవచ్చు. ఇది రుచిని పెంచడమే కాకుండా ప్రోటీన్, ఫైబర్‌ను కూడా అందిస్తుంది.
ఓవర్‌నైట్ ఓట్స్ లో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఆరోగ్యకరమైన ఉదయపు ఆహారంగా మారుతుంది. బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది.
ఫ్రూట్ సలాడ్‌లో చియా సీడ్స్ జోడించడం మంచి అలవాటు. పండ్లలోని పోషకాలతో కలిసి ఇవి మరింత ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.
చియా పుడ్డింగ్ తయారు చేసుకుని స్నాక్‌గా తీసుకోవచ్చు. పాలు లేదా ప్లాంట్ బేస్డ్ మిల్క్‌లో నానబెట్టి తయారు చేసే ఈ వంటకం ఆరోగ్యకరమైన ఎంపికగా ఉంటుంది.
అయితే చియా సీడ్స్‌ను తగిన మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే కొందరిలో జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో రోజుకు ఒకటి లేదా రెండు స్పూన్లు సరిపోతాయి.