మామిడి తురుము పచ్చడి వేసవి కాలంలో చాలా మంది ఇష్టంగా తినే ప్రత్యేక వంటకం. పులుపు, కారం కలిసిన ఈ పచ్చడి అన్నంలో ఎంతో రుచిగా ఉంటుంది.
పచ్చి మామిడికాయలను తాజాగా ఎంచుకుంటే పచ్చడి రుచి మరింత బాగుంటుంది. గట్టిగా ఉన్న కాయలు తీసుకోవడం మంచిది.
మామిడిని శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడిచి తురుముకోవాలి. తురిమేటప్పుడు గింజ భాగం కలవకుండా జాగ్రత్త పడాలి.
తగినంత ఉప్పు వేస్తే పచ్చడి ఎక్కువకాలం నిల్వ ఉంటుంది. ఉప్పు తక్కువైతే త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
కారం, ఆవాల పొడి సరైన మోతాదులో కలిపితే రుచి అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ మసాలా వేస్తే అసలు రుచి తగ్గిపోతుంది.
వెల్లుల్లి రెబ్బలు కలిపితే ప్రత్యేకమైన వాసన వస్తుంది. కొంతమంది మెంతుల పొడి కూడా వేసుకుంటారు.
నూనె వేడి చేసి చల్లారిన తర్వాత కలిపితే పచ్చడి తాజాగా ఉంటుంది. ఇది నిల్వ కాలాన్ని కూడా పెంచుతుంది.
సాధారణంగా ఒక కిలో పచ్చి మామిడి తురుముకు 200 గ్రాముల ఉప్పు, 250 గ్రాముల కారం, 50 గ్రాముల ఆవాల పొడి, 2 టేబుల్ స్పూన్లు మెంతుల పొడి, 150 నుంచి 200 మిల్లీలీటర్ల నూనె అవసరమవుతుంది.
కారంపరిమాణం వ్యక్తిగత రుచికి తగ్గట్టు కొంచెం తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ప్యాకెట్స్ లో అమ్మే కారం కాకుండా ఇంటి వద్ద తయారు చేసుకునే కారాన్ని పచ్చడికి వాడితే రంగు రుచి బాగుంటుంది.
తడి లేని గాజు సీసాలో నిల్వ చేస్తే రుచి మారకుండా ఉంటుంది. ప్రతిసారి పొడి చెంచాతో మాత్రమే తీసుకోవాలి.
మామిడి తురుము పచ్చడి వేడి అన్నంలో నెయ్యితో తింటే మరింత రుచిగా అనిపిస్తుంది. వేసవిలో ఇది ఎంతో మంది ఇళ్లలో ప్రత్యేక వంటకంగా ఉంటుంది.